»   » సీరియస్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న మంచు విష్ణు

సీరియస్ యాక్సిడెంట్ నుండి కోలుకున్న మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో మంచు విష్ణు పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగులో జాయిన్ అవ్వబోతున్నారు. 40 రోజుల క్రితం విష్ణు "ఆచారి అమెరికా యాత్ర" షూటింగ్ గాయపడ్డ సంగతి తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగాబైక్ స్కిడ్ అవ్వడంతో మంచు విష్ణు, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గాయాలపాయ్యారు.

ఈ ప్రమాదంలో ప్రగ్యా చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకోగా.. మంచు విష్ణుకు మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మలేషియాలో మొదలైన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఆగిపోయింది. దాదాపు 40 రోజుల పాటు చికిత్స అనంతరం మంచు విష్ణు పూర్తిగా కోలుకున్నారు.


 Manchu Vishnu is Back to Work

చిత్ర నిర్మాతలు కీర్తి చౌదరి-కిట్టు, మాట్లాడుతూ.. "చాలా సీరియస్ యాక్సిడెంట్‌లో తగిలిన గాయాల నుండి మంచు విష్ణు త్వరగా రికవరీ అవడం చాలా ఆనందంగా ఉంది. త్వరలో ప్రారంభం కాబోయే షెడ్యూల్ లో మంచు విష్ణు పాల్గొంటారు అని తెలిపారు. అమెరికాలో 30 రోజుల పాటు కొన్నికీలక సీన్లు చిత్రీకరించనున్నారు. అక్టోబర్ రెండో వారంలోగా షెడ్యూల్ కంప్లీట్ చేసి హైదరాబాద్ తిరిగి రావాలని ప్లాన్ చేస్తున్నారు.


Hansika Romance With Manchu Vishnu - మంచు విష్ణు తో హన్సిక రొమాన్స్ - Filmibeat Telugu

విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, కోట శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరామ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, పృథ్వి, ప్రవీణ్, అనూప్ ఠాకూర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: సెల్వ, మాటలు: డార్లింగ్ స్వామి, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి.

English summary
Aced film actor Vishnu Manchu is recovered following injuries on the set of ‘Achari America Yatra’.The actor headed to US for a 30-day schedule, where the filmmakers will shoot some crucial scenes in the film and expected to complete their foreign schedule by the second week of October and fly down to Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu