»   »  దేశాన్ని రెండుగా విడగొట్టాలి: మంచు విష్ణు సంచలన కామెంట్స్

దేశాన్ని రెండుగా విడగొట్టాలి: మంచు విష్ణు సంచలన కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏపీ స్పెషల్ స్టేటస్ ఉద్యమం విశాఖ ఆర్కే బీచ్ లో ఈ నెల 26న మొదలు కానున్న నేపథ్యంలో హీరో మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేసారు. దేశాన్ని రెండుగా విభజిస్తే బావుంటుంది అంటూ కామెంట్స్ చేసారు.

మంచు విష్ణు నటించిన 'లక్కున్నోడు' చిత్రం ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో విష్ణు ఓ ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ స్పెషల్ స్టేటస్, ఈ నెల 26 ఆర్కేబీచ్ ఉద్యమం అంశాలు చర్చకు రాగా విష్ణు స్పందించారు.

శాంతియుత పోరాటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందన్న సంగతిని జల్లికట్టు పోరాటం మనకు గుర్తు చేస్తోంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటానికి నా నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది అని విష్ణు అన్నారు.

 దేశం కలిసుంటే ఏంటి లాభం?

దేశం కలిసుంటే ఏంటి లాభం?

దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కానీ, మనకు మాత్రం ఉత్తరాది నుంచి సరైన గుర్తింపు రావడం లేదు. అలాంటప్పుడు కలిసి ఉంటే లాభం ఏంటి? కాబట్టి ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను రెండు వేర్వేరు దేశాలుగా విడగొట్టేస్తేనే బాగుంటుంది అని విష్ణు వ్యాఖ్యానించారు.

 అలాంటపుడు విడిపోవడమే బెటర్

అలాంటపుడు విడిపోవడమే బెటర్

సమైక్య భారతంలో మనకు సరైన గుర్తింపు లేనపుడు కలిసి ఉండడం కన్నా విడిపోవడమే బెటర్ అని మంచు విష్ణు కామెంట్స్ చేయడం సంచలనం అయింది. మరి అతడి కామెంట్ష్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో? చూడాల్సిందే.

 పెద్ద కొడుకు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు!

పెద్ద కొడుకు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు!

టాలీవుడ్లో నటుడు మోహన్ బాబుకు ఓ పేరుంది. ఆయన క్రమ శిక్షణకు మారు పేరు, ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా ముక్కు సూటిగా చేస్తారు. కానీ విష్ణు తీరుపై మోహన్ బాబు విసిగిపోయి వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 లక్కున్నోడు

లక్కున్నోడు

మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ "లక్కున్నోడు". "గీతాంజలి" ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ సొంతం చేసుకుని ఈ నెల 26న విడుదలవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
The ongoing Jallikattu movement in Tamil Nadu seems an inspiration to neighbour states. Now, The youth of Andhra Pradesh taking inspiration from the Marina beach protest of Chennai. Andhra Pradesh Youth called for a silent protest on AP Special Status at RK Beach, Vizag, on January 26th i.e. on Republic Day. Tollywood actor Manchu Vishnu Supports AP Special Status Protest at RK Beach.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu