»   » 'బాహుబలి' స్ఫూర్తిగా 'కన్నప్ప' ని తీస్తాం

'బాహుబలి' స్ఫూర్తిగా 'కన్నప్ప' ని తీస్తాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'కన్నప్ప' ఓ ధీశాలి. తనికెళ్ల భరణిగారు రాసుకొన్న స్క్రిప్టులో యాక్షన్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందుకే ఆ స్థాయిలో తీయాలనుకొంటున్నాం. మొన్నే రాజమౌళిగారు 'బాహుబలి' తీశారు. అలాంటి సినిమాలతో మన తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఆ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి. హాలీవుడ్‌ 'బెన్‌హర్‌' దగ్గరే ఆగిపోలేదు. తరవాత 'టైటానిక్‌' వచ్చింది. 'ట్రాయ్‌' కన్నా గొప్ప సినిమా తీయలేం అనుకొంటే అందులో 10 శాతం బడ్జెట్‌లో '300' తీశారు అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మంచు విష్ణు మాట్లాడుతూ... 'జురాసిక్‌ పార్క్‌' 1993లో వచ్చింది. ఇప్పుడు ఆ క్వాలిటీ కూడా మన సినిమాల్లో కనిపించదు. ఎవరో రాజమౌళి లాంటి ఒకరిద్దరే ఆ స్థాయి సినిమాలు తీయగలుగుతున్నారు. 'బాహుబలి' వల్ల మన మార్కెట్‌ పెరిగింది. బడ్జెట్‌లు పెరుగుతున్నాయి. మిగిలిన సినిమాలు 'బాహుబలి'ని స్ఫూర్తిగా తీసుకోవాలి.

Manchu Vishnu talked about 'Kannappa' Movie

చక్రాన్ని కనిపెట్టాక దాన్ని వాడుకోవాలి. అలాంటి మరో యంత్రం కనిపెట్టాలి. దాన్నే వాడుకోవాలి అనే మూర్ఖత్వం నాకు లేదు. 'కన్నప్ప' లాంటి సినిమా అనుకొన్నది అనుకొన్నట్టు తీయాలంటే దాదాపు రూ.100 కోట్లు కావాలి. నా దగ్గర అంత బడ్జెట్‌ లేదు. అందులో సగం బడ్జెట్‌కి రెట్టింపు నాణ్యత కనిపించాలంటే హాలీవుడ్‌ సహకారం తీసుకోవాల్సిందే.

ఈ ప్రాజెక్ట్‌ నా చేతికి రావడం నిజంగా ఈశ్వరుడి ప్రసాదమే. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. హాలీవుడ్‌ నిపుణుల సహకారం తీసుకొంటున్నాం.

English summary
Manchu Vishnu is now starring in ‘Kannappa Katha’ based on great devotee of Lord Shiva, Kannappa. Earlier Krishnam Raju spellbound all as Bhakta Kannappa and Vishnu says, the film's story is getting ready. Tanikella Bharani is directing the film which may go to sets after the release of ‘Dynamite’.
Please Wait while comments are loading...