For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యావరేజ్ కానీ...: ‘గబ్బర్ సింగ్‌’ పై మంచు విష్ణు

  By Bojja Kumar
  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం విజయ పరంపరకు సెలబ్రిటీలు సైతం ముగ్ధులైపోతున్న సంగతే తెలిసిందే. ఆ రేంజిలో ఉంది మరి గబ్బర్ సింగ్ ప్రభంజనం. 81 ఏళ్ల తెలుగు సినిమా రికార్డులను తిరిగరాస్తూ ఈ చిత్రం సరికొత్త రికార్డులను తిరగ రాస్తోంది.

  గబ్బర్ సింగ్ చిత్రంపై తాజాగా మంచు విష్ణవర్ధన్ తన ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపించాడు. 'మొత్తానికి గబ్బర్ సింగ్ చిత్రాన్ని చూశాను. నార్మల్ యావరేజ్ స్క్రిప్టు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్, హరీష్ శంకర్ డైరెక్షన్ సూపర్బ్. వీరిద్దరి పనితనం వల్లనే చిత్రం ఇంత పెద్ద విజయం సాధించింది' అంటూ ట్వీట్ చేశారు.

  అంతే కాకండా...'దర్శకుడు హరీష్ శంకర్ డేరింగ్ మూవ్, గట్స్‌కు హాట్సాఫ్. పెద్ద హీరోలతో సినిమాలు చేయడం, సక్సెస్ సాధించడం అంత సులభం కాదు. కానీ హరీష్ సాధించాడు' అంటూ పొగడ్తలు గుప్పించాడు.

  వరుస ప్లాపులు, పిల్లలు పుట్టడం తదితర కారణాలతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు విష్ణు ప్రస్తుతం 'దేనికైనా రెడీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. నా కెరీర్‌లో ప్రత్యేకస్థానంలో నిలిచే సినిమా ఇది, 'ఢీ' తర్వాత ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ చిత్రం తన కెరీర్‌లో నిలుస్తుందని విష్ణు తెలిపారు.

  నాగేశ్వర రెడ్డి సినిమా కథ గురించి చెబుతూ... ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందనేది చూపించబోతున్నామన్నారు.

  ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌ బాబు.

  English summary
  “Saw Gabbar Singh, finally. Normal average script, Superb direction & Superb performance by Mr.Pawan Kalyan, made this movie a block buster”, Manchu Vishnu tweeted. He went on to say ” hats off to Director harish shankar for his daring move and guts. Not easy directing big stars and getting success.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X