»   » క్రిష్ నెక్ట్స్ మూవీ ‘మణికర్ణిక’ కాశీలో మొదలైంది (ఫోటోస్)

క్రిష్ నెక్ట్స్ మూవీ ‘మణికర్ణిక’ కాశీలో మొదలైంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్లో మరో చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఆయన తెరెక్కించబోయే 'మణికర్ణిక' మూవీ ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం వారణాసి(కాశీ)లో జరిగింది.

ఝాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'బాహుబలి' రచయిత విజయేంద్రప్రసాద్ ఈచిత్రానికి కథ అందించారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తోంది. శంకర్-ఎస్సాన్-లాయ్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కొంటెంట్ స్టూడియోస్ బేనర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఝాన్సీకి రాణి లక్ష్మి భాయి అసలు పేరు మణికర్ణిక. మరాఠా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె1828 లో వారణాసిలో జన్మించారు. అందుకే సినిమాను అక్కడి నుండే ప్రారంభించాలని నిర్ణయించిన క్రిష్ ఫస్ట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వారణాసిలో ఏర్పాటు చేసారు.

గంగానది తీరంలో...

గంగానది తీరంలో...

వారణాసిలోని గంగానది తీరంలో ‘మణికర్ణిక' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దశ్వమేధ్ ఘాట్ వద్ద గంగా హారతి నిర్వహించిన అనంతరం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

మూడు భాషల్లో...

మూడు భాషల్లో...

మణికర్ణిక చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తరహాలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు క్రిష్.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

2018 ఏప్రిల్ 27న ఈ మూవీ విడుదల కానుంది. అందుకు తగిన విధంగా సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారు.

English summary
Gamyam, Vedam, Gabbar is Back movie's director Krish's new venturre Manikarnika title logo launch and release date announcement held at Varanasi. Film story based on life of Jhansi Lakshmi Bai, Bhajarangi Bhaijan writer Vijayendra Prasad given the story for the film .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu