»   » టార్చర్ పెట్టాడు, తాగుడు నేర్పాడు, నా కూతురుని దూరం చేసాడు: నటి ఊర్వశి

టార్చర్ పెట్టాడు, తాగుడు నేర్పాడు, నా కూతురుని దూరం చేసాడు: నటి ఊర్వశి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : సీరియల్స్‌ తో పాటు సినిమాల్లోనూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది నటి ఊర్వశి. ఇటీవల 'జిల్' మూవీలో గోపిచంద్‌కు తల్లిగా నటించింది. అటు మలయాళం, తమిళం, తెలుగు వంటి సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక అవార్డులకైతే కొదవేలేదు. జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం లో చాలా ఇబ్బందులు పడింది.

ఈ విషయమై మళయాళి నటి ఊర్శసి రీసెంట్ గా మళయాళ మీడియాతో మాట్లాడింది. తన మొదటి భర్త మనోజ్ .కె. జయన్ తనను ఎంత టార్చర్ పెట్టాడో చెప్పుకొచ్చింది. పెళ్లైన రెండు నెలలు కూడా కాకుండానే తను సినిమాల్లో నటించి, డబ్బులు తెమ్మని బలవంతపెట్టేవాడని చెప్పుకొచ్చింది.

సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా కాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారు కొంత కాలానికి విడిపోవడం అన్నది జరుగుతున్నా ఈ సంస్కృతి మలయాళ తారల మధ్య కాస్త అధికంగా నెలకొంటుందన్నది జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థం అవుతోంది.

మలయాళ నటుడు మనోజ్.కె.జయన్ ను ఇంతకు మునుపు వివాహం చేసుకున్న ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంది. మనోజ్ కు, ఊర్వశికి పొరపొచ్చాలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. మీడియాతో ఊర్వశి ఏమి మాట్లాడిందో చూద్దాం.

వైలెంట్ పర్శన్

వైలెంట్ పర్శన్

పెళ్లయ్యే దాకా అతను ఎలాంటివాడో తెలియలేదు. తర్వాత తెలిసింది ..అతను ఎంత వైలెంట్ పర్శనో. చాలా దారుణంగా బిహేవ్ చేసేవాడు. నన్ను చాలా రకాలుగా టార్చర్ పెట్టేవాడు. జాలి అనేది ఉండేది కాదు అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది ఊర్వశి.

ఫ్యామిలి అంతా తాగటమే

ఫ్యామిలి అంతా తాగటమే

తన మాజీ భర్త ఫ్యామిలీ అంతా కూర్చుని తాగుతూంటారని ఆమె చెప్పుకొచ్చింది. తనకు తాగుడు అలవాటు చేసారని, అంతకు ముందు అసలు తాను ఎప్పుడూ తాగ లేదని చెప్పుకొచ్చింది. తన జీవితంలో అతనితో, ఆ కుటుంబంతో ఉన్నన్ని రోజులూ పీడకలే అంది.

ఏదీ వదలిపెట్టను

ఏదీ వదలిపెట్టను

మనోజ్ తో విడిపోయి ఇంతకాలం అయినా ఊర్వశి అతనిపై కోపం పోలేదు. ఖచ్చితంగా అతని చేసినవన్నీ బయిటపెడతానని అంది. ఏదీ వదలిపెట్టనని, తను ఆటోబయోగ్రఫి రాస్తానని, అందులో తను జీవితంలో ఎదురైన ఆచీకటి రోజులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తానని అంది.

తాగి కోర్టుకి

తాగి కోర్టుకి

ఊర్వశి ఎంతలాతాగుడికి ఎడెక్ట్ అయ్యిపోయిందంటే...విడాకుల కోర్టుకు కూడా ఆమె తాగే వచ్చింది. అదే కారణంతో ఆమె మాజీ భర్త విడాకులు తీసుకున్నారు. అయితే ఆ తాగుడు అంతా అతని పుణ్యమే అని ఆరోపిస్తోంది ఊర్వశి. రీసెంట్ గా ఓ అవార్డ్ పంక్షన్ కు సైతం తాగి వచ్చి మీడియాకు ఎక్కింది.

ఫుల్ బిజీ

ఫుల్ బిజీ

మళయాలం నటుడు మనోజ్ కె జయంత్‌ను ఆమె 2000 సంవత్సరంలో పెళ్లాడారు. 2008లో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊర్వశి సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.

కూతురుని అక్కడే

కూతురుని అక్కడే

మనోజ్ ఆ మధ్యన (2011) ఆశా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. ఊర్వశి-మనోజ్‌ల దాంపత్యం ద్వారా జన్మించిన కూతురు ఇపుడు మనోజ్ వద్దే ఉంటోంది. ఆమె అక్కడ హ్యాపీగానే ఉంటోందని మళయాళ మీడియా చెప్తోంది.

కాంటాక్టర్ ని చేసుకుంది

కాంటాక్టర్ ని చేసుకుంది

కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న ఊర్వశి ఈ మధ్య శివప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. శివప్రసాద్ కన్ స్ట్రక్షన్ కాంట్రాక్టర్ అట. తన సోదరుడికి ఫ్రెండ్ అట. శివప్రసాద్‌‍ను రెండో వివాహం చేసుకునే ముందు ఊర్వశి తన కూతురు నుండి అంగీకారం పొందినట్లు తెలుస్తోంది. సో ఇద్దరూ పెళ్లి పరంగా మరోసారి సెటిలైనట్టే.

ఇంటర్వూలో రివీల్

ఇంటర్వూలో రివీల్

కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఊర్వశి తాజాగా ఈ విషయాన్ని కేరళకు చెందిన వనిత అనే మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'శివప్రసాద్ నా సోదరుడు కమల్‌కు చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా ఏళ్లుగా ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండు. మాలో ఒకరిగా కలిసిపోయారు' అని ఊర్వశి వెల్లడించారు.

మా నాన్న ఎప్పుడూ తాగలేదు

మా నాన్న ఎప్పుడూ తాగలేదు

కూతురుని ఎవరిదగ్గర ఉంచాలి అనే విషయమై ఊశ్వరితన మాజి భర్తతో కోర్టుకు ఎక్కింది. అయితే ఫ్యామిలీ కోర్టుకు తాగి వెళ్లి అభాసు పాలైంది. కానీ ఈ తాగుడుకి కారణం తన మాజీ భర్త నేర్పటమే అంది. అయితే కూతుర మాత్రం దీన్ని కొట్టిపారేస్తోంది. మా నాన్న ఎప్పుడూ తాగటం చూడలేదని, కానీ మా అమ్మ మాత్రం తాగిందని, నేను ఆమెతో వెళ్లనని చెప్పింది.

ఎన్ని సినిమాలో..

ఎన్ని సినిమాలో..

ఊర్వశి సినిమా జీవితానికి గురించిన వివరాల్లోకి వెళితే....1980ల్లో సినిమా హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన ఆమె మళయాలం, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమె రుస్తుం, జీవన పోరాటం, చెట్టుకింద ప్లీడర్, సందడే సందడి, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, స్వరాభిషేకం, చక్రం చిత్రాల్లో నటించింది.

వరసపెట్టి...

వరసపెట్టి...

హీరోయిన్స్ కు పుట్టినిల్లుగా పేరుగన్న మాలీవుడ్‌కు చెందిన వారు ఇలాంటి పరిణామాలకు గురవ్వడం కాస్త బాధాకరమే. ఒక నాటి ప్రముఖ నటి శ్రీవిద్య, ఊర్వశి, లిజిల నుంచి కావ్యామాధవన్, కావ్యాఉన్ని, అమలాపాల్‌ల వరకూ పలువురు హీరోయిన్స్ విడాకుల బాట పట్టిన వారే. ఇక్కడ తప్పెవరిది అన్న విషయం పక్కన పెడితే ప్రేమపై నమ్మకం, పెళ్లి మీద గౌరవం కొరవడుతోందన్నడానికి ఒక కారణంగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. సెలబ్రిటీలుగా వెలుగొందుతున్నవారి ప్రభావం సమాజంపై కచ్చితంగా పడుతుందన్నది గమనార్హం.

విడిపోయాకే హ్యాపీగా

విడిపోయాకే హ్యాపీగా

ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త విజయ్ నుంచి విడిపోయిన నటి అమలాపాల్ లైఫ్ ఎలా ఉంది అన్న ప్రశ్నకు 'చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకు ముందు శిక్షణ పొందిన యోగాతో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నాను.ఆనందం అన్నది బయట ఎక్కడ నుంచో రాదు. అది మనలోనే ఉంటుం ది. అయినా నేను నటినవ్వడం, ప్రేమ, పెళ్లి, విడిపోవడం, ఇప్పుడిలా భేటీ ఇవ్వడం అంతా నాకు ఆశ్చర్యంగా ఉంది' అని బదులిచ్చారు.

English summary
According to Malayalam media, actress Urvashi said that her former husband Manoj K Jeyan tortured her a lot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu