»   » పవర్ స్టార్ కోసం మహేష్ సోదరి రాసుకున్న కథ ఇదే.. పవనే పర్ఫెక్ట్..!

పవర్ స్టార్ కోసం మహేష్ సోదరి రాసుకున్న కథ ఇదే.. పవనే పర్ఫెక్ట్..!

Subscribe to Filmibeat Telugu

తాను తెరకెక్కించిన 'మనసుకు నచ్చింది' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల. మనసు కు నచ్చింది చిత్రం ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా మంజుల తరచుగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన తీసుకుని రావడం సినీ ఇండస్ట్రీలో చర్చ నియాంశంగా మారింది.

Mahesh Babu Sister Manjula Script For Pawan Kalyan

ఇటీవల మంజుల పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం తాను ఓ కథని రాసుకున్నానని ఆయన ఒకే అంటే సినిమా చేస్తానంటూ ప్రకటించారు. తాజగా ఆ కథ వివరాలని కూడా మంజుల తెలియజేసారు. మంజుల వెల్లడించిన కథ పవన్ జీవితానికి దగ్గరగా ఉండడం విశేషం.

నటిగా గుర్తింపు

నటిగా గుర్తింపు

మంజుల పలు చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా మారారు. ఆరెంజ్, కావ్యాస్ డైరీ వంటి చిత్రాల్లో మంజుల నటించిన సంగతి తెలిసిందే.

దర్శకురాలిగా తొలి ప్రయత్నం

దర్శకురాలిగా తొలి ప్రయత్నం

మంజుల దర్శకురాలిగా మారి మంజుల తెరకెక్కిస్తున్న తొలి చిత్రం మనసుకు నచ్చింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సంబందించిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మంజుల ముందుండి మరీ ప్రమోషన్ కార్యక్రమాలని జరిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తావన

పవన్ కళ్యాణ్ ప్రస్తావన

పలు ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్న మంజులకు తన సోదరుడు మహేష్ గురించి మరియు పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు ఎదురవుతోనే ఉన్నాయి. ఆమె అని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇస్తున్నారు.పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని వీళ్ళిద్దరూ సింప్లిసిటీకి ప్రాధానత్య ఇస్తారని మంజుల అన్నారు.

 పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ గా సరిపోయే కథ

పవన్ కళ్యాణ్ కు పర్ఫెక్ట్ గా సరిపోయే కథ

పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపితే ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంజుల అన్నారు. పవన్ కళ్యాణ్ కోసం కథని సైతం సిద్ధం చేసానని ఇటీవల తెలిపిన మంజుల తాజగా స్టోరీ లైన్ ని రివీల్ చేసారు. సినిమాల్లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న వ్యక్తి ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తాడు అనే పాయింట్ ఆధారంగా కథని రాసుకునట్లు మంజుల తెలిపారు.

మహేష్ కోసం కూడా

మహేష్ కోసం కూడా

తాను ఏ హీరోని కూడా దృష్టిలో పెట్టుకుని కథలు రాయనని, కథలు రాసుకున్నాక ఏ హీరో సరిపోతాడో చూసుకుంటానని అన్నారు. తన సోదరుడు మహేష్ బాబు కోసం మంచి కథ రాయాలనేది తన కల అని మంజుల వెల్లడించారు.

English summary
Manjula Ghattamaneni revels story line for Pawan Kalyan. The story is related to Pawan Kalyan real life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu