»   » మన్మధుడు హీరోయిన్ అన్షు...ఎక్కడుందో? ఏం చేస్తోందో తెలుసా?

మన్మధుడు హీరోయిన్ అన్షు...ఎక్కడుందో? ఏం చేస్తోందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున కెరీర్లో అభిమానులందరికీ ఎప్పుడూ గుర్తుండిపోయే సినిమా 'మన్మధుడు'. దీంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అన్షు అంబానీని కూడా అభిమానులు ఎప్పటికీ మరువలేరు. ఆకట్టుకునే నటన, అమాయకమైన చూపులు, మాటలతో అన్షు అప్పట్లో కుర్రాళ్లను ఫిదా చేసింది.

అయితే అన్షు తెలుగులో కేవలం రెండు సినిమాలకే పరిమితం అయింది. మన్మధుడు, రాఘవేంద్ర సినిమాల తర్వాత ఆమె తెలుగులోనే కాదు... అసలు సినిమా ఇండస్ట్రీలోనే లేకుండా పోయింది.

ఆ తర్వాత అన్షు ఎక్కడా కనిపించలేదు, కనీసం ఆమె గురించి వార్తలు కూడా వినిపించలేదు. కట్ చేస్తే అన్షు ఇపుడు లండన్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

అప్పట్లో హీరోయిన్ గా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం కంటే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలవ్వడానికే మొగ్గు చూపింది. ఇపుడు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కూడా.

లండన్లో...

లండన్లో...

సచిన్ సగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న అన్షు అంబానీ ప్రస్తుతం లండన్లో ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కూడా జన్మించారు.

ఆమె కూడా అక్కడి నుండే...

ఆమె కూడా అక్కడి నుండే...

అన్షు కూడా లండన్ లోనే పుట్టి పెరిగింది. అయితే మోడలింగ్, ఇండియన్ సినిమాలపై ఆసక్తితో టీనేజీ వయసులోనే ఇటువైపుగా అడుగులు వేసింది.

సొంతగా బిజినెస్

సొంతగా బిజినెస్

లండన్లో అన్షు ఇపుడు ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.

English summary
In the industry that is majorly driven by glamour and fad, heroines come and go everyday. But a few would actually make a special place for themselves in the showbiz. Anshu Ambani, the girl who mesmerized the Telugu audience with her performance in Manmadhudu and Raghavendra, is one such beauty, who managed to make place for herself in the hearts of Telugites.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X