»   » మదర్స్ డే సంతోషం లేదు: ఆ హీరో తల్లి కన్నుమూత!

మదర్స్ డే సంతోషం లేదు: ఆ హీరో తల్లి కన్నుమూత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రపంచ మంతా మదర్స్ డే సంబరాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అందరూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అయితే తెలుగు హీరో ఇంట మాత్రం మదర్స్ డే ఆనందం లేదు. ఎందుకంటే ఆ హీరోకు జన్మనిచ్చిన ఆ తల్లి కన్నమూసింది.

తెలుగు హీరో హీరో మనోజ్ నందం తల్లి ఉషారాణి శనివారం (మే 9) కన్నమూసారు. గత కొన్ని నెలలుగా ఆమె లంగ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూసారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనోజ్ నందం తన తల్లి పరిస్థితి గురించి మాట్లాడుతూ...‘అమ్మ ట్రీట్మెంటు కోసం చాలా డబ్బు అవసరం పడింది. అందుకే నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకుంటూ వచ్చాను. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఇకపై కథ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను' అన్నారు.

Manoj's Mother passed away

అయితే అనుకోకుండా...మనోజ్ తల్లి శనివారం కన్నుమూసారు. 51 ఏళ్ల ఉషారాణికి భర్తతో పాటు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మణికొండలో ఆమె ఒక ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు. ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

చైల్డ్ ఆర్టిస్టుగా చత్రపతి, అతడు చిత్రాల్లో నటించిన మనోజ్ నందం...... ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ప్రేమ ప్రయాణం, ఒక క్రిమినల్ ప్రేమకథ, అలౌకిక చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న బుల్లిపెట్టెలో బూచోడు, యూత్ ఫుల్ లవ్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

English summary
Hero Manoj Nandam's Mother Usha Rani passed away Today (May 9th, 2015). She has been suffering from Lung Cancer for sometime.
Please Wait while comments are loading...