»   » గబ్బర్‌సింగ్ గెటప్లో ఎమ్మెస్ నారాయణ రొమాన్స్(ఫోటోలు)

గబ్బర్‌సింగ్ గెటప్లో ఎమ్మెస్ నారాయణ రొమాన్స్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కళ్ల కింద క్యారీ బ్యాగులేసుకుని... నిన్ను హీరో చేస్తానంటే ఎలా నమ్మావురా? అంటూ ఎమ్మెస్ నారాయణను ఉద్దేశించి బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో ఎమ్మెస్ నారాయణ హీరోగా కాకపోవచ్చేమోకానీ.....చిన్న సినిమాలకు మాత్రం ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్లే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే హీరోలు.

తాజాగా ఎమ్మెస్ నారాయాణ 'మనుషులతో జాగ్రత్త' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు గబ్బర్ సింగ్ గెపట్ వేసి ఓ ఐటం సాంగు కూడా చేయించారు. సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఆ స్టిల్స్ విడుదల చేసారు. దీన్ని బట్టి వీరు సినిమాకు ఎంత కీలకంగా మారారో అర్థం చేసుకోవచ్చు.

సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు స్లైడ్ షోలో....

మనుషులతో జాగ్రత్త

మనుషులతో జాగ్రత్త


రాజేంద్రప్రసాద్ యముడిగా, అక్షయ్ తేజ్, సోనియా బిర్జి జంటగా విక్రమార్క ప్రొడక్షన్స్ పతాకంపై ప్రారంభమైన చిత్రం ‘మనుషులతో జాగ్రత్త'. ఈ సినిమాలో కృష్ణభగవాన్ చిత్రగుప్తుని పాత్రలో కనిపించనున్నాడు.

దర్శక నిర్మాతలు

దర్శక నిర్మాతలు


గోవింద్‌ వరహా(నేను నాన్న అబద్దం ఫేం) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మనుషులతో జాగ్రత్త' చిత్రాన్ని వసుంధర సమర్పణలో విక్రమార్క ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బి.చిరంజీవులు నాయుడు, రొట్టా అప్పారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నేటి పరిస్థితుల నేపథ్యంలో..

నేటి పరిస్థితుల నేపథ్యంలో..


నేటి సామాజిక అన్యాయాలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ యముడు పాత్ర పోషిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ

దర్శకుడు మాట్లాడుతూ


దర్శకుడు గోవింద్‌ వరహా మాట్లాడుతూ... నేను నాన్న అబద్దం తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. డబ్బు రుచి మరిగిన మనిషి... ఆ డబ్బు కోసం ఎన్ని అడ్డదార్లు తొక్కుతున్నాను. వాటి కారణంగా అతను ఎలా నష్టపోతున్నాడు అనేది ఈ చిత్ర కథాంశం.

ఇతర వివరాలు

ఇతర వివరాలు


ఈ చిత్రానికి సంగీతం: ప్రణవ్, నిర్మాతలు: బి.చిరంజీవులు నాయుడు, రొట్టి అప్పారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోవింద్ వరహా.

English summary
Manushulatho Jagratha is an upcoming Telugu film directed by Govinda Varaha starring Rajendra Prasad, Akshay Teja, Sonia George and Krishna Bhagavaan. Chiranjeevulu Naidu and Rotta Appa Rao are producing this film under Vikramarka production and Pranav provides the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu