»   » అంతా పవన్ ని అనుకరిస్తున్నారంటూ దాసరి కామెంట్

అంతా పవన్ ని అనుకరిస్తున్నారంటూ దాసరి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''మామూలుగా ఏ హీరోకైనా ఓ శైలి ఉంటుంది. ఎన్టీఆర్‌దో శైలి. ఏయన్నార్‌దో శైలి. పవన్ కల్యాణ్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. అతని శైలిని హీరోలందరూ అనుకరించడానికి ప్రయత్నిస్తుంటే అల్లు అర్జున్ మాత్రం వేరొక స్టయిల్‌లో దూసుకెళుతున్నాడు. బన్నీని చాలామంది హీరోలు కాపీ కొడుతున్నారు'' అని 'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుక సభలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు డా. దాసరి నారాయణరావు అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Many Heroes are following Pawan Kalyan Style: Dasari

అల్లు అర్జున్, సమంత, అదా శర్మ, నిత్యామీనన్ కాంబినేషన్‌లో ఎస్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'. డా. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు చేశారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి సీడీని ఆవిష్కరించి అల్లు అరవింద్‌కి ఇచ్చారు.

దాసరి ఇంకా మాట్లాడుతూ - ''అల్లు రామలింగయ్యగారంటే నాకెంతో అభిమానం. నా చేతుల మీదగా ప్రారంభమైన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థకు రెండు ఘనవిజయాలు ఇచ్చాను. అల్లు అర్జున్ ఇవాళ ఎవరూ ఊహించని స్థాయిలో నిలబడ్డాడు. 'అత్తారింటికి దారేది' విజయం తర్వాత త్రివిక్రమ్, 'రేసు గుర్రం' విజయం తర్వాత అల్లు అర్జున్ చేసిన ఈ చిత్రం ఆ రెండు చిత్రాలకు దీటుగా ఉంటుందనిపిస్తోంది. ప్రచార చిత్రాలు, పాటలు బాగున్నాయి'' అన్నారు.

English summary
"NTR and ANR has got a style of their own. In the same way, Pawan Kalyan created a style of his own (huge applause from fans). A lot of heroes are copying his style now. But, Allu Arjun succeeded in creating a different style," says Dasari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu