»   »  4కోట్ల సినిమా 75 కోట్లు కొల్లగొట్టింది :తెలుగులోనూ రానున్న ప్రేమకథ "సైరాట్"

4కోట్ల సినిమా 75 కోట్లు కొల్లగొట్టింది :తెలుగులోనూ రానున్న ప్రేమకథ "సైరాట్"

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామూలనుకున్న సినిమాలు కోట్లుకొల్ల గొట్టడం, ఇరగదీస్తాయనుకున్న సినిమాలు మూలన పడిపోవటం మనకు కొత్తేం కాదు. దీనికి తాజా ఉదాహరణ బ్రహ్మోత్సవం, బిచ్చగాడు సినిమాల ఫలిఒతాలే. భారీ అంచనాల మధ్య విడుదలైన స్టార్ హీరో మహేష్ బ్రహ్మోత్సవం బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలిపోతే అసలు మామూలు వసూళ్ళు సాధిస్తుందనుకున్న తమిళ డబ్బింగ్ సినిమా "బిచ్చగాడు" మాత్రం కాసులు కురిపించింది.

ఇదేవిధంగా మహారాష్ట్ర లోనూ ఎవరూ ఊహించని విధంగా మరాఠీలో వచ్చిన ఒక సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన "సైరాట్" మూవీ అక్కడ మహారాష్ట్రలో ఏకంగా రూ.75 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. త్వరలోనే రూ.100 కోట్ల మార్కును కూడా అందుకునేలా ఉంది. అంటే పెట్టుబడి మీద దాదాపు 25 రెట్ల వసూళ్లన్నమాట.

నూతన నటీనటులు ఆకాష్, రింకూ రాజ్ గురు హీరో హీరోయిన్లుగా నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మామూలుగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు ఉండవంటారు. కానీ ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో "స్పెషల్ జ్యూరీ" పురస్కారం అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గానూ సూపర్ సక్సెస్ అయింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే పుంజుకుని రెండో వారం నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్లతో అదరగొట్టింది.

Marathi movie Sairat to get Telugu remake

సినిమా ప్రారంభం సమయంలో రింకు.. ఆకాశ్‌లకు రూ. 4లక్షల చొప్పున రెమ్యూనరేషన్‌ ఇచ్చారు. అయితే ఈ సినిమా కోట్లు రాబట్టుతుండటంతో ఇద్దరికీ చెరో 5 కోట్ల రూపాయాలు బోనస్‌ ఇస్తామని నిర్మాతలు ప్రకటించారు. వీరిద్దరికే కాదు.. ఇతర నటులకు.. సినిమా కోసం కష్టపడ్డ అందరికీ బోనస్‌లు ఇస్తామని వెల్లడించారు.

ముందు ఈ సినిమాను పట్టించుకోని మల్టీప్లెక్సులు తర్వాత చచ్చినట్లు ఈ సినిమాను ప్రదర్శించాల్సి వచ్చింది. 20 రోజుల్లోనే రూ.50 కోట్ల దాకా కొల్లగొట్టిన ఈ చిత్రం.. 31 రోజులకు రూ.75 కోట్ల మార్కును దాటింది. ఇంకా వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూ ఉంది. త్వరలోనే వంద కోట్ల మార్కును కూడా అందుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతుండటం విశేషం.

English summary
"Sairat" is a Marathi movie which was released recently and received huge commercial hit. many Telugu producers are keen to buy remake rights at any cost.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu