»   » సమంతకు మొదలైన పెళ్లి టెన్షన్.. సహకరించండి ప్లీజ్!

సమంతకు మొదలైన పెళ్లి టెన్షన్.. సహకరించండి ప్లీజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్లి గడియలు దగ్గర పడుతున్న కొద్ది సినీ నటి సమంతకు టెన్షన్ ఎక్కువ అవుతున్నదట. పెళ్లికి ముందే సినిమా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని నిర్మాతలకు చెప్పి పెళ్లికి ముందే తనను షూటింగుల నుంచి ఫ్రీ చేయాలని సూచిస్తుందట. అక్టోబర్ 6వ తేదీన సమంత, తాను వివాహం చేసుకొంటున్నట్టు ఇటీవల ఫిలింఫేర్‌కు సంబంధించిన కార్యక్రమంలో నాగచైతన్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

పెళ్లి ముహూర్తం ఖరారు..

పెళ్లి ముహూర్తం ఖరారు..

గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్న నాగచైతన్య, సమంత ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. వీరి వివాహం హిందూ, క్రైస్తవ మతాచారాల ప్రకారం రెండు సార్లు జరుగనున్నది. అక్టోబర్‌ ఆరో తేదీన నాగచైతన్య, సమంతల వివాహ వేడుకకు ముహూర్తం ఖరారైంది. వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు సమాచారం.

 చేతినిండా సినిమాలే..

చేతినిండా సినిమాలే..

కాగా పెళ్లికి ముందు వచ్చిన పలు ఆఫర్లను సమంత నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. అయినా సమంత చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. తమిళంలో విజయ్‌తో ఒక చిత్రం, విశాల్‌కు జంటగా ఇరుంబుతిరై, అనీతి కథైగళ్‌ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తున్నారు.

 తమిళ, తెలుగు రంగాల్లో బిజీ..

తమిళ, తెలుగు రంగాల్లో బిజీ..

ఇవి కాకుండా తమిళంలో శివకార్తికేయన్‌తో జత కట్టడానికి అంగీకరించారు. శివకార్తికేయన్‌తో రొమాన్స్‌ చేయనున్న చిత్రం ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానుంది. అలాగే తెలుగులో రాంచరణ్‌తో రంగస్థలం, నాగార్జున నటిస్తున్న రాజుగారి గది2 చిత్రంలోనూ సమంత నటిస్తున్నది. అలాగే మహానటి సావిత్రి బయోపిక్‌లోనూ మరో కీలక పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తున్నది.

దర్శక, నిర్మాతలకు రిక్వెస్ట్

దర్శక, నిర్మాతలకు రిక్వెస్ట్

ఇలా పలు చిత్రాలతో బిజీగా మారిన సమంత పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో దర్శక నిర్మాతలకు రిక్వెస్ట్ చేస్తున్నారట. తాను నటిస్తున్న చిత్రాల్లో తన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించిందట. తన పరిస్థితి అర్థం చేసుకొని వెసలుబాటు చేసుకోవాలని కోరిందట.

రెండు నెలలు దూరంగా..

రెండు నెలలు దూరంగా..

అక్టోబర్‌ 6వ తేదీన పెళ్లి జరగనుండడంతో సెప్టెంబర్‌ కల్లా ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. వివాహానంతరం రెండునెలలపా టు సినిమాలకు దూరంగా ఉండి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం.

    English summary
    Actress Samantha is getting ready to marriage with Nagachaitanya Akkineni. Their marriage is fixed on october 6 of this year. Before her marriage Samantha wants finish her movie project and likely to away two months for cinema shootings.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu