»   » సంగీతా బిజ్లానీ షాకింగ్ కామెంట్స్.. సల్మాన్, అజారుద్దీన్‌పై సీరియస్..

సంగీతా బిజ్లానీ షాకింగ్ కామెంట్స్.. సల్మాన్, అజారుద్దీన్‌పై సీరియస్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటి, అజారుద్దీన్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ చాలా రోజుల తర్వాత మరోసారి మీడియా వెలుగులోకి వచ్చారు. అజారుద్దీన్‌తో విడిపోయిన తర్వాత ఒంటరి జీవితం గడుపుతున్న ఆమె మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. గతంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగింది. వారిద్దరి నుంచి విడిపోయిన తర్వాత తన ప్రేమ విఫలం కావడంపై గానీ, వైవాహిక జీవితం అర్ధాంతరంగా ముగిసినప్పుడు గానీ స్పందించలేదు.

 ప్రేమలో ఎక్కువ కాలం జీవించలేవు

ప్రేమలో ఎక్కువ కాలం జీవించలేవు

కానీ ఇటీవల కాలంలో బిజ్లీస్ట్రైయిక్స్ అనే బ్లాగ్‌ను ప్రారంభించారు. ప్రేమ, బంధాలు, అనుబంధాలు, హృదయవేదన లాంటి అంశాలపై తన అభిప్రాయాలను తన బ్లాగ్‌లో ఆమె వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సంగీతా బిజ్లానీ పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'నీవు అమితంగా ప్రేమించిన వారితో ఎక్కువకాలం జీవించలేవు. నీ నుంచి దూరం వెళ్లేవారిని వెళ్లనివ్వు' అని తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.

 వాటిని పట్టించుకోవడం లేదు

వాటిని పట్టించుకోవడం లేదు

జీవితం, పెళ్లి అనే రెండు అంశాలకు సినిమాల్లో మాదిరిగా సుఖాంతం ఉండదు. ఆధునిక జీవితంలో పెళ్లి అనేది చాలా కఠినమైనది. వైవాహిక జీవితంలో ఇంటెన్సిటీని, శారీరక, మానసిక సంబంధాలు, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ విలువలను పట్టించుకోవడం లేదు. అందుకే సంప్రదాయ పద్దతుల్లో జరిగే పెళ్లిళ్లు కష్టంగా మారాయి.

ఎక్కువ ప్రేమను ఆశిస్తే..

ఎక్కువ ప్రేమను ఆశిస్తే..

ఒకరి నుంచి నీవు ప్రేమను ఆశించినపుడు హార్ట్ అవుతావు. నియంత్రించుకోలేనిది ప్రేమ. ఎప్పుడైతే నియంత్రణ, అంచనాలు ఉంటాయో అప్పుడు వాగ్వాదాలు, బాధ, హృదయం ముక్కలవ్వడం, విషాదం లాంటి వెంటాడుతుంటాయి. ప్రేమ పేరుతో వాటి బారిన పడటం ఖాయం అని సంగీతా వెల్లడించారు.

ఒక్కొక్కరు ఒక ప్రేమను..

ఒక్కొక్కరు ఒక ప్రేమను..

చాలా మంది రిలేషన్స్ గురించి తెలుసు. ప్రేమలో ఒకరిని మరొకరు అమితంగా ప్రేమించడం, తమ భాగస్వామిని కొన్ని విషయాల్లో నియంత్రించడం జరుగుతుంటాయి అని సంగీతా వెల్లడించారు. జీవితంలో ఒక్కొక్కరు ఒక రకమైన ప్రేమను చూపిస్తారు. అదే నా జీవితంలో నేను నేర్చుకొన్న గొప్ప విషయం అని సంగీత తెలిపారు.

 కొన్నిసార్లు అర్ధాంతరంగా..

కొన్నిసార్లు అర్ధాంతరంగా..

కొందరితో ప్రేమ జీవితాంతం కొనసాగుతుంటుంది. కొన్నిసార్లు అర్థాంతరంగా ముగిసిపోతుంది. కొన్నిసార్లు వారిలోనే ప్రేమను వెతుక్కొంటారు. వీలుకాకపోతే మరొకరిలో ఆ ప్రేమను వెతుక్కొంటారు. దానిని పొందుతారు అని అన్నారు.

సల్మాన్‌, అజార్‌ను ఉద్దేశించేనా

సల్మాన్‌, అజార్‌ను ఉద్దేశించేనా

తాజాగా ఆమె బ్లాగులో కనిపించిన అభిప్రాయాలపై పలువురు స్పందించారు. వాటిని అజారుద్దీన్, సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించే చేసి ఉంటారని పేర్కొంటున్నారు. ఎన్నో ఏండ్లుగా మౌనం దాల్చిన ఆమె సడన్‌గా ఎందుకు బ్లాగ్‌లో స్పందిస్తున్నారో అర్ధం కావడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్‌తో పీకల్లోతు ప్రేమలో..

సల్మాన్‌తో పీకల్లోతు ప్రేమలో..

మిస్ ఇండియాగా ఎంపికైన తర్వాత సంగీతా బిజ్లానీ, సల్మాన్ ఖాన్ వ్యాపార ప్రకటనల్లో కనిపించారు. చాలా సంవత్సరాలు సంగీత , సల్మాన్ అఫైర్‌ను కొనసాగించారు. పెళ్లి చేసుకొంటారని అందరూ భావించిన సమయంలో అనూహ్యంగా భారత కెప్టెన్ అజారుద్దీన్‌ను వివాహమాడారు.

సంగీతా హ్యాండిచ్చింది..

సంగీతా హ్యాండిచ్చింది..

ఇటీవల కాఫీ విత్ కరణ్ అనే కార్యక్రమంలో సంగీత‌తో అఫైర్‌పై సల్మాన్ స్పందించారు. అజారుద్దీన్ కోసం నాకు హ్యాండ్ ఇచ్చి పారిపోయింది అని సల్మాన్ తెలిపారు. సంగీత తీసుకొన్న విషయం అంతుపట్టకుండా ఉందని అన్నారు.

అజారుద్దీన్ కోసమే..

అజారుద్దీన్ కోసమే..

అజారుద్దీన్‌తో విడిపోయిన తర్వాత ప్రస్తుతం సల్మాన్‌కు సంగీత చేరువైందనే రూమర్ బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. హిట్ అండ్ రన్ కేసు నుంచి సల్మాన్ విముక్తుడై ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో సల్లూభాయ్ ఇంటివద్ద ఆయన కోసం వేచి ఉండటం మీడియాను అమితంగా ఆకర్షించింది.

 గుత్తా జ్వాలా కారణంగానే

గుత్తా జ్వాలా కారణంగానే

సంగీతతో ప్రేమలో పడేనాటికే అజారుద్దీన్ పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా. సంగీతను అమితంగా ప్రేమించిన అజారుద్దీన్ చాలా రిస్కే తీసుకొన్నారు. సంగీతాను పెళ్లాడటానికి అజారుద్దీన్ తల్లిదండ్రులను కూడా ఎదురించారు. 14 ఏళ్ల వివాహ జీవితం తర్వాత 2010లో సంగీత, అజారుద్దీన్ విడిపోయారు. బాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తాతో అఫైర్ కారణంగా అజారుద్దీన్ సంగీతాను వదులుకొన్నాడనే రూమర్ అప్పట్లో వచ్చింది.

English summary
Salman Khan and Mohammad Azharuddin's ex Sangeeta Bijlani blogs on love. Bijlani, who is currently single, has talked about love, relationships and heartbreak in her blog Bijlistrikes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu