»   » దిల్ రాజు, మారుతి ల 'రోజులు మారాయి' టాక్ , కథ ఏంటి?

దిల్ రాజు, మారుతి ల 'రోజులు మారాయి' టాక్ , కథ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మారుది, దిల్ రాజు కాంబినేషన్ లో కలిసి నిర్మించిన చిత్రం 'రోజులు మారాయి' . ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మారుతి కథ,స్క్రీన్ ప్లే అందించటంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. అలాగే దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత ఇలాంటి చిన్న సినిమాను నిర్మిస్తున్నారనగానే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఇలాంటి అంచనాలతో రిలీజైన ఈ చిత్రం మార్నింగ్ షో టాక్ ఏంటి.

ఈ సినిమా చూసి వచ్చిన వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ చిత్రం ఫస్టాఫ్ బాగానే ఎంజాయ్ చేసేలా రూపొందింది. సెకండాఫ్ మాత్రం పూర్తి ప్రెడిక్టబుల్ గా మారిపోయింది. అవుడ్ డేటెడ్ అనిపించింది అన్నారు. ఈ చిత్రానికి ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారో అని అంటున్నారు. అయితే కామిడి కొంత వర్కవుట్ అవటం సినిమాని పాస్ అయ్యేలా చేసే అవకాసం ఉందంటున్నారు.

 Maruthi's 'Rojulu Marayi' talk: It is Predictable

చిత్రం కథేమిటంటే.. అశ్వంత్ (చేతన్) ఆధ్యా (కృత్తిక జయకుమార్) తో ప్రేమలో ఉంటాడు. అలాగే పీటర్ (పార్వతీశం) ..రంభ (తేజస్విని) తో ప్రేమలో పడతారు. ఆధ్యా, రంభ ఇద్దరూ రూమ్ మేట్స్. ఇద్దరూ ఇండిపెండింట్. అయితే ఆధ్య, రంభలు ఇద్దరూ మంచి డబ్బున్నవాళ్లని, తాము కలలు కనే రాజకుమారులను పెళ్లిచేసుకోవాలని యుఎస్ లో సెటిల్ అవ్వాలనుకుంటారు. అందుకోసం వారు ఓ ప్లాన్ చేస్తారు.

ఆ ప్లాన్ లో భాగంగా పీటర్, అశ్వంత్ లను వాడుకోవాలని చూస్తారు. ప్లాన్ ని అమలుపరుస్తూ..పీటర్, అశ్వంత్ లను పెళ్లి చేసుకుంటారు. అయితే కొద్ది రోజులు తర్వాత వారిద్దరూ చనిపోతారు. అసలు వాళ్ళకేం జరిగింది. ఎవరు మర్డర్ చేసారు. అసలు ట్విస్ట్ ఏంటి అనేది మిగతా కథ.

చేత‌న్‌ మద్దినేని, పార్వతీశ‌మ్‌, కృతిక‌, తేజ‌స్వి ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్నారు. రోజులు మారాయి చిత్రం ఫస్ట్ లుక్ కి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌టంతో ట్రేడ్ లో ఈ చిత్రానికి క్రేజ్ వ‌చ్చింది. ఈరోజుల్లో, బ‌స్ స్టాప్, ప్రేమ‌క‌థాచిత్రమ్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన జె.బి ఈ చిత్రానికి సంగీతం చేశారు. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది.

English summary
Maruthi's RojuluMarayi is a film that has an engaging first half but the film dips down drastically because of the predictable and outdated second half.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu