»   » వెంకీ, రామ్ ‘మసాలా’ లొకేషన్ (ఫోటోలు)

వెంకీ, రామ్ ‘మసాలా’ లొకేషన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 'మసాలా'. హిందీలో విజయవంతమైన 'బోల్‌ బచ్చన్‌' చిత్రానికి ఇది రీమేక్. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. కె.విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని డిసురేష్ బాబు సమర్పణలో స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్నారు.

పూర్తి వినోదాత్మక చిత్రంగా 'మసాలా' తెరకెక్కుతోంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను రంజింప చేసే విధంగా పక్కా స్క్రీన్ ప్లే, డైలాగులు, కామెడీ సన్నివేశాలు, యాక్షన్ సీన్లు తదితర అంశాలతో కూడిన కమర్షియల్ మసాలాను బాగా దట్టించి గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ విడుదలయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను, సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో వీక్షించండి.

దసరాకు ఆడియో

దసరాకు ఆడియో

మసాలా చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దాసర పండక్కి ఆడియో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు

ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. వీలైనంత త్వరగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి....పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ నెలలో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

దర్శకుడే ముఖ్యమంటున్న రామ్

దర్శకుడే ముఖ్యమంటున్న రామ్

సినిమాలపై హీరో రామ్ తన మనోగతం గురించి వెల్లడిస్తూ ‘నేను దర్శకుణ్ణి నమ్మి సినిమాలు చేస్తాను. ఫలానా కథ కావాలని ఏ దర్శకుణ్ణి కోరను. ఎందుకంటే నటుడిగా నేను ఒక్క కోణంలోనే ఆలోచిస్తాను. దర్శకులు వారి సృజనకు అనుగుణంగా నన్ను సరికొత్త పంథాలో ఆవిష్కరించాలని ఆలోచిస్తారు. కథ నచ్చితే దానికి వందశాతం న్యాయం చేయడంపైనే నేను దృష్టిపెడతాను' అని వెల్లడించారు.

వెంకటేష్

వెంకటేష్

సోలోగా సినిమాలు చేయడం వల్ల అంతగా కలిసి రాక పోవడంతో మల్టీ స్టారర్ సినిమాలపై దృష్టి సారించిన వెంకటేష్....అలాంటి స్క్రిప్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు

హిందీ రీమేక్

హిందీ రీమేక్

హిందీలో రూపొందిన ‘బోల్ బచ్చన్'లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. అక్కడ సినిమా సూపర్ హిట్టయింది. ‘మసాలా' చిత్రంలో అజయ్ దేవగన్ పాత్రలో వెంకీ, అభిషేక్ పాత్రలో రామ్ కనిపించనున్నారు.

కమర్షియల్ కాబట్టి సేఫ్

కమర్షియల్ కాబట్టి సేఫ్

సినిమా మొత్తం కమర్షియల్ అంశాలతో కూడిన మసాలా స్టఫ్‌తో నిండిఉండటంతో.....ఫలితాలు సత్ఫలితాలు ఇస్తాయనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు.

English summary
Telugu film Masala casts Anjali and Shazan Padamsee as heroines where the former will pair u with Venkatesh after SVSC and the latter will romance the energetic star Ram. Masala is directed by K Vijaya Bhaskar and produced by Sravanthi Ravikishore along with Suresh Babu jointly on Sravanti Movies and Suresh Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu