»   » ఇంకో సారి మాస్ పోలీస్ ...., విక్రం సిరి దర్శకత్వం లో రవితేజ సినిమా మొదలయ్యింది

ఇంకో సారి మాస్ పోలీస్ ...., విక్రం సిరి దర్శకత్వం లో రవితేజ సినిమా మొదలయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్‌ హీరోగా తిరుగులేని మార్కెట్‌ ఉన్న రవితేజ తీసుకుంటున్న విరామం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతి సీజన్‌లోనూ ప్రేక్షకులకు వినోదం పంచుతూ.. మంచి హిట్స్ అందుకున్న హీరో రవితేజ. గతంలో ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసేవారు. ఆ తర్వాత రెండు.. ఇప్పుడు ఒకటి. ఎప్పటికప్పుడు సినిమా సినిమాకీ గ్యాప్ లేకుండా చూసుకోవాలని రవితేజ అనుకుంటున్నప్పటికీ ఎందుకనో గ్యాప్ వచ్చేస్తోంది.,

గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన 'బెంగాల్ టైగర్' తర్వాత ఈ మాస్ హీరో ఇప్పటి వరకూ మేకప్ వేసుకోలేదు. దర్శక-నిర్మాతలెవరూ రవితేజ దగ్గరికి వెళ్లడం లేదా.. అంటే అదీ కాదు. ఆయనతో సినిమా తీయాలని ప్రయత్నించే దర్శక-నిర్మాతలు చాలామంది ఉన్నారు. కానీ ఏ ప్రయత్నమూ ముందుకు సాగతం లేదు. అయితే ఇప్పుడు తాజా వార్తల ప్రకారం 'లక్ష్మీ', 'లక్ష్యం', 'రేసు గుర్రం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు. ఆ వివరాలు....

బెంగాల్ టైగర్ నుంచీ ఖాళీ గానే:

బెంగాల్ టైగర్ నుంచీ ఖాళీ గానే:

హీరోగా మంచి మార్కెట్‌ ఉన్నప్పటికీ కొత్త సినిమాలు అంగీకరించడంలో రవితేజ ఆలస్యం చేస్తున్నాడు. రవితేజ నటించిన ‘బెంగాల్‌ టైగర్‌' తర్వాత మరో చిత్రానికి సైన్‌ చేయలేదు. మాస్‌ హీరోగా తిరుగులేని మార్కెట్‌ ఉన్న రవితేజ తీసుకుంటున్న విరామం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

రెండు సినిమాలు చేసి ఉండాల్సింది:

రెండు సినిమాలు చేసి ఉండాల్సింది:

ఆయన స్పీడ్‌కు ఇప్పటికే రెండు సినిమాలు చేసి ఉండాల్సింది. అనేక కథలు వింటున్నట్టు సమాచారం. రవితేజ డేట్స్‌ కోసం పలువురు నిర్మాతలు సంప్రదిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు.

రెండు ప్రాజెక్టులను ఫైనల్‌ చేశాడు:

రెండు ప్రాజెక్టులను ఫైనల్‌ చేశాడు:

తాజాగా తెలిసిందేమంటే రవితేజ రెండు ప్రాజెక్టులను ఫైనల్‌ చేశారని. కొద్ది రోజుల క్రితం రచయిత విక్రమ్‌ సిరి చెప్పిన కథ నచ్చిందని, అతడి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది.

నల్లమలుపు శ్రీనివాస్:

నల్లమలుపు శ్రీనివాస్:

'లక్ష్మీ', 'లక్ష్యం', 'రేసు గుర్రం' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ అధినేత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) తాజాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారు.

విక్రమ్ సిరి :

విక్రమ్ సిరి :

ఎన్టీఆర్ తో 'అదుర్స్' నిర్మించిన శాసన సభ్యుడు వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించనున్నారు. నల్లమలుపు బుజ్జి నిర్మించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'రేసు గుర్రం' చిత్రాలకు స్ర్కీన్ ప్లే రచయితగా వ్యవహరించిన విక్రమ్ సిరి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు.

వక్కంతం వంశీ కథ :

వక్కంతం వంశీ కథ :

'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నారు విక్రమ్ సిరి. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.

పవర్ ఫుల్ ఎనర్జిటిక్ స్టోరీ :

పవర్ ఫుల్ ఎనర్జిటిక్ స్టోరీ :

త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ - ''రవితేజ హీరోగా మా సంస్థలో ఇది మొదటి సినిమా. మంచి కథ కుదిరింది. వక్కంతం వంశీ పవర్ ఫుల్ ఎనర్జిటిక్ స్టోరీ తయారు చేశారు.

ఆనందంగా ఉంది:

ఆనందంగా ఉంది:

శాసన సభ్యుడైన వల్లభనేని వంశీతో కలిసి ఈ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తేలియజేస్తాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లి రాజేష్.

English summary
A source related to the film revealed, Vakkantham Vamsi has written story of the film and it will be cop drama venture which will revolves around the story of larger than life policeman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu