»   » కామెడీ థ్రిల్లర్ "మాయామాల్"కి యూ/ఏ సర్టిఫికెట్

కామెడీ థ్రిల్లర్ "మాయామాల్"కి యూ/ఏ సర్టిఫికెట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. జూన్ 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ ఎంటర్ టైనర్ ను కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోవింద్ లాలం మాట్లాడుతూ.. "మా సినిమా సెన్సార్ పూర్తయ్యింది. హారర్ కి హిలేరియస్ కామెడీ కలగలిసి "మాయా మాల్" ఎగ్జయిటింగ్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులందరూ బాగుందంటూ మెచ్చుకోవడంతోపాటు.. నా దర్శకత్వ ప్రతిభను కొనియాడడం ఎప్పటికీ మరువలేను. "మాయామాల్" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మంచి ఎంటర్‌టైనర్‌ అని నమ్మకంగా చెప్పగలను" అన్నారు.


Maya Mal Telugu Horror Thriller Movie censor compleat

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "అనుకున్నదానికంటే సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. సినిమాలో విలన్ ఎవరనేది ఆసక్తికరమైన అంశం. జూన్ 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.
షకలక శంకర్, తాగుబోతు రమేష్, సోనియా, పృథ్వీరాజ్, నాగినీడు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: సతీష్ శెట్టి, యాక్షన్: విజయ్, కళ: రమణ వంక, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర, సంగీతం: సాయికార్తీక్, నిర్మాతలు: కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: గోవింద్ లాలం!


English summary
Telugu upcoming Movie Mayamal censor compleated and got U/A cirtificat, this Movie will be out on this june 30
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu