»   » నేను, నా ఫ్యాన్స్... అంటూ నిహారిక అదరగొట్టింది (వీడియో)

నేను, నా ఫ్యాన్స్... అంటూ నిహారిక అదరగొట్టింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొణిదెల నిహారిక నటించిన తొలి వెబ్ సిరీస్ 'ముద్ద పప్పు ఆవకాయ్' మంచి విజయం సాధించింది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆమెకు ఈ వెబ్ సిరీస్ మంచి బూస్ట్ ఇచ్చినట్లయింది. దీంతో పాటు నిహారికకు భారీగా అభిమానులు కూడా ఏర్పడ్డారు. గత వారం ఆమె తన ఫ్యాన్స్ తో ఫేస్ బుక్ ద్వారా లైవ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు.

నిహారిక అభిమానులు అడిగే వింత ప్రశ్నలు, అందుకు తగిన విధంగా ఆమె ఇచ్చిన సమాధానాలతో ఈ చిట్ చాట్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ ఇంటర్వ్యూలో ఆమెను అభిమానులు చాలా అడిగారు. కొందరు ముద్దులు కూడా అడిగారు. దానికి నిహారిక ఎలా సమాధానం ఇచ్చారో ఓసారి చూడండి.

నిహారిక త్వరలో 'ఒక మనసు' మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. 'ఒక మనసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసారు.

Me & My Fans - Niharika Konidela Live Chat on FB Page

ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వచ్చింది. మరో వైపు నిహారిక ముద్దపప్పు ఆవకాయ్ తో యాక్టింగ్ టాలెంట్ పరంగా తానేంటో నిరూపించుకుంది. వెబ్ సిరీస్ లో అదరగొట్టిన నిహారిక సినిమాలో మరింత ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరిగింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

English summary
After the Grand Success of first Web Series Muddapappu avakai, Niharika Konidela Speaks to her fans on Facebook Live chat. She Shared a lot with her fans with all the wit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu