»   » పెళ్లివేడుకలో శ్రీదేవికి ఘోర అవమానం, బోని మొదటి భార్య బంధువుల వల్లే.. ఏం జరిగింది!

పెళ్లివేడుకలో శ్రీదేవికి ఘోర అవమానం, బోని మొదటి భార్య బంధువుల వల్లే.. ఏం జరిగింది!

Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణం తరువాత విషాదంలో ఉన్న సినీ అభిమానులు, ప్రముఖులంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అతిలోక సుందరి చివరి అంకం ప్రశాంతంగా ముగుస్తుందా లేదా అనే అనుమానాలు ఈ ఆందోళనకు కారణం. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని శ్రీదేవి బాత్ టబ్ లో అలా ఎలా మునిగిపోయారనే ప్రశ్న ఇటు అభుమానులతో పాటు, దుబాయ్ ప్రభుత్వానికి కూడా కలిగింది. శ్రీదేవి మృతి విషయంలో విచారణ ఓ కొలిక్కి వచ్చాకే ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ణయించుకుంది. దీనితో అసలు శ్రీదేవి మృతికి దారితీసిన కారణాల గురించి మీడియాలో ఆశ్చర్యకరమైన కథనాలు వస్తున్నాయి.

Sridevi News : అర్జున్ కపూర్ ఇబ్బంది పెట్టేవాడని చెప్పిన శ్రీదేవి
అభిమానుల్లో తీవ్ర ఆందోళన

అభిమానుల్లో తీవ్ర ఆందోళన

అతిలోక సుందరిగా దశాబ్దాల కాలం పాటు వెండితెరపై మన్ననలు అందుకున్న శ్రీదేవి చివరి మజిలీ ఇంత విషాదంగా మారుతోందేంటి అని సగటు అభిమాని తీవ్ర వేదనని వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబంతో కలసి సంతోషంగా

కుటుంబంతో కలసి సంతోషంగా

శ్రీదేవి తన భర్త బోనికపూర్, చిన్న కుమార్తె ఖుషితో కలసి సంతోషంగా దుబాయ్ లో జరిగే తన మేనల్లుడి వివాహానికి వెళ్ళింది. కానీ దుబాయ్ శ్రీదేవి మరణానికి దారితీసిన పరిణామాలు ఏంటి? శ్రీదేవి మరణం సహజమా ? ప్రమాదమా ? లేక ఆత్మహత్య అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

హోటల్ లో ఒంటరిగా

హోటల్ లో ఒంటరిగా

శ్రీదేవి చివరి వరకు కుటుంబంతో సంతోషంగానే ఉంది. కానీ వివాహ వేడుకకు దుబాయ్ వెళ్ళాక బోనికపూర్ తిరిగి ముంబై వచ్చేసారు. ఆ సమయంలో శ్రీదేవి ఒంటరిగా దుబాయ్ లోని హోటల్ లో బసచేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి.

పెళ్ళిలో ఏం జరిగింది

పెళ్ళిలో ఏం జరిగింది

బోనికపూర్ శ్రీదేవిని ఒంటరిగా వదిలేసి రావడనికి కారణం ఏంటి? శ్రీదేవి మూడురోజులపాటు దుబాయ్ హోటల్ లో బసచేయడానికి బలమైన కారణం ఏమైనా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పెళ్లిలో కూడా శ్రీదేవి సంతోషంగానే కనిపించింది. కానీ తాజాగా ఆ పెళ్ళితంతు గురించి మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి.

శ్రీదేవిని ఏకాకిని చేశారా

శ్రీదేవిని ఏకాకిని చేశారా

దుబాయ్ లో శ్రీదేవి మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం జరిగింది. ఆ వేడుకలో బోనికపూర్ మొదటి భార్య బంధువులు శ్రీదేవిని ఏకాకిని చేసి అవమానించారని కథనాలు ప్రముఖ మీడియా సంస్థల్లో వస్తున్నాయి.

అవమానంతో మనోవేదన

అవమానంతో మనోవేదన

పెళ్ళిలో జరిగిన అవమానముతో శ్రీదేవి మనో వేదనకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ బాధతోనే శ్రీదేవి మూడు రోజులపాటు హోటల్ నుంచి బయటకు రాలేదని కథనాలు వెలువడుతున్నాయి.

బోనికపూర్ కూడా కారణమా

బోనికపూర్ కూడా కారణమా

శ్రీదేవితో ఆందోళనకు మరోకారణం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బోనికపూర్ తన మొదటి భార్య పిల్లలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుండడం కూడా శ్రీదేవిలో ఆందోళనకు కారణం అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పట్టు వదలని పబ్లిక్ ప్రాసిక్యూషన్

పట్టు వదలని పబ్లిక్ ప్రాసిక్యూషన్

శ్రీదేవి పార్థివ దేహం ఇండియాకు రావాలంటే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతి అవసరం. ఈ కేసులో చిక్కుముడి వీడేంతవరకు వారు వదిలేలా కనిపించడం లేదు.

English summary
Media houses circulating reasons behind Sridevi death. Sridevi may suffers from family problems
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu