»   » చిరు లో ఆ గ్రేస్ తగ్గిందా..?? ఇక ఈ ప్రాజెక్ట్ ఆపేస్తున్నారా..??

చిరు లో ఆ గ్రేస్ తగ్గిందా..?? ఇక ఈ ప్రాజెక్ట్ ఆపేస్తున్నారా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీలో పాపులర్ అయిన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమాన్ని తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా ప్రసారమైన తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ప్రసారం అవుతున్న నాలుగో సీజన్ ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఖైదీ నెంబర్ 150'తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎంఈకే షోకు రెస్పాన్స్ అదిరిపోతుందని టీవి ఛానెల్ వాళ్లే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా భావించారు. దానికి తోడు ..ఈ షో ఆరంభంలోనే నాగార్జున గెస్ట్ గా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడు. అయినా ఈ ప్రోగ్రాంకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదనే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

చిరంజీవి

చిరంజీవి

రంజీవి ఎట్రాక్షన్‌ యాడ్ చేసినా ఎప్పుడో బోర్‌ కొట్టేసిన ఈ కాన్సెప్ట్‌కి కొత్తగా కళ రాదని తేలిపోయింది. మామూలుగా కంటే ఎక్కువగా సెలబ్రిటీలని పిలిపిస్తూ జనాల దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే సెలబ్రిటీ ఎపిసోడ్స్‌ కూడా క్లిక్‌ అవకపోయే సరికి ఏం చేయాలో చిరంజీవికి, నిర్వాహకులకి పాలుపోవడం లేదు.

పెద్ద సంచలనం

పెద్ద సంచలనం

ఇంకా ఇంకా టీఆర్పీలు కుంటు పడుతూ వుండేసరికి అసలు నెక్స్‌ట్‌ సీజన్‌ చేయాలా అని చిరంజీవి ఆలోచిస్తున్నారట. ఏడాదిన్నర కిందట నాగార్జున హోస్ట్ గా మొదలుపెట్టిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం పెద్ద సంచలనం సృష్టించింది. తెలుగు టీవి హిస్టరీ లోనే మరే కార్యక్రమానికి రాని స్థాయిలో ఊహించిన టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుంది ఈ కార్యక్రమం.

రేటింగ్స్ తగ్గుతూ

రేటింగ్స్ తగ్గుతూ

ఐతే తొలి సీజన్ తో పోలిస్తే తర్వాతి రెండు సీజన్లలో రేటింగ్స్ తగ్గుతూ వెళ్లడంతో నాలుగో సీజన్ కు నాగ్ స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చింది మాటీవీ యాజమాన్యం. దాంతో ఈ ఫెయిల్యూర్ ని చిరంజీవి కి కట్టబెట్టడం పద్దతి కాదంటున్నారు. మూడు సీజన్ల వరకు కాంట్రాక్ట్‌ సైన్‌ చేసినప్పటికీ,

 కొనసాగించడం అనవసరం

కొనసాగించడం అనవసరం

షోకి ఆదరణ లేనపుడు కొనసాగించడం అనవసరమని అనుకుంటున్నారట. ఈ సీజన్‌ పూర్తయ్యేలోగా టీఆర్పీలు పుంజుకోనట్టయితే ఇక 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ని కాల్‌ ఆఫ్‌ చేస్తారట. తన బుల్లితెర ఎంట్రీ మెగా హిట్‌ అవుతుందని కాన్ఫిడెంట్‌గా వున్న చిరంజీవికి ఇది ఇలా ఫ్లాప్‌ అవడం చాలా ఇబ్బందిగా వుందట.

 ఉన్నపళంగా ఆపేయడం

ఉన్నపళంగా ఆపేయడం

అయితే షోని ఉన్నపళంగా ఆపేయడం సబబు కాదు కనుక ఏదో రకంగా జనాల దృష్టిని ఆకట్టుకునేందుకు తన టీమ్‌తో ప్రత్యేక కసరత్తులు చేయిస్తున్నారట. కానీ ఏం చేసినా మీలో ఎవరు కోటీశ్వరుడుకి మాత్రం పని జరగడం లేదు. మరోవైపు ఈ షో ఫ్లాప్‌ అవడం మెగాస్టార్‌ హేటర్స్‌కి ట్రోల్‌ చేయడానికి కొత్త ఆప్షన్‌ ఇచ్చినట్టయింది. దీంతో ఈ షో ఫాన్స్‌కి కూడా హెడ్డేక్‌గా తయారైంది.

English summary
People thought that the Television show 'Meelo Evaru Koteeswarudu' will be taken to another level with the new host Chiranjeevi's the megastar of Tollywood grand entry to small screen with the highest TRPs. But the channel people and Chiru's fans got shocked with the ratings of the show 'MEK'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X