»   » కాపురంలో చిచ్చు పెట్టద్దు మీనా

కాపురంలో చిచ్చు పెట్టద్దు మీనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమ కాపురం బంగారంలా సాగుతోందని, ఎలాంటి సమస్యలూ లేవని మీనా మీడియా ముందుకు వచ్చి మరీ వివరించింది. అలాగే తాము విడాకులు తీసుకుంటున్నామంటూ వచ్చిన వార్తలు కేవలం నిరాధారమైనవే నని ఖండించింది. అలాగే మీడియా అత్యుత్యాహంతో తమ మధ్య కలతలు పెట్టడానికా అన్నట్లు రూమర్స్ స్పెడ్ చేస్తోందంటూ దయచేసి తమ కాపురంలో అటువంటివి జరగలేదని గమనించమని చెప్పుకొచ్చింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా ఆ మధ్య బెంగుళురుకు చెందిన విద్యాసాగర్ అనే ఇంజనీర్ ను పెళ్లాడింది. అయితే కొద్ది రోజులుగా వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయంటూ పత్రికల్లో రావటం మొదలైంది. అలాగే వివాహం అనంతరం మళ్లీ కొత్త చిత్రాలకు అగ్రిమెంట్ చేస్తూ భర్తను నిర్లక్ష్యం చేస్తోందనీ, చివరకు ముందుగా ప్లాన్ చేసుకున్న హనీమూన్ కూడా కేన్సిల్ చేసుకుని షూటింగ్ కు హాజరు కావడం ఆమె అత్తామామలు జీర్ణించుకోలేకున్నారనీ వినపడ్డాయి. వీటికి క్లైమాక్స్ అన్నట్లు త్వరలోనే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోనున్నారంటూ వదంతులు వినిపించాయి. దీంతో మీనా తాజాగా వివరణ ఇవ్వక తప్పలేదు. తాజాగా ఆమె కన్నడంలో తెలుగులో హిట్టయిన మై నేమ్ ఈజ్ మంగతాయారు సీరియల్ ని రీమేక్ వెర్షన్ లో చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu