»   »  తల్లిగా సమంత: విజయ్ సరసన నటి మీనా కూతురు

తల్లిగా సమంత: విజయ్ సరసన నటి మీనా కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి మీనా కూతురు నైనిక వెండి తెరకు పరిచయం కాబోతోంది. విజయ్ హీరోగా తెరకు ఎక్కుతున్న ఓ కోలీవుడ్ మూవీలో మీనా కూతురు నటిస్తోంది. కాగా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో తనకంటూ ఓ స్టార్ డమ్‌ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సమంత ఈ సినిమాలో తల్లిగా నటిస్తోంది.

ఇంతకు ముందు సమంత మనం తెలుగు సినిమాలో తల్లి పాత్రలో నటించింది. ఈసారి మరో హీరోయిన్ కూతురికి తల్లిగా నటించబోతోంది. హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్న సమయంలో తల్లి పాత్ర ద్వారా సాహసం చేసిన తర్వాత మళ్లీ వెండితెరపై తల్లి పాత్రను చేయకూడదని అనుకుందట. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని కోలీవుడ్ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తోంది.

Meena's daughter Nainika enters intio film world

విజయ్ హీరోగా రాజా రాణి దర్శకుడు అట్లీ.. కలిపులి ధాను నిర్మాతగా ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా సమంత నటిస్తుండగా, మరో హీరోయిన్ అమీ జాక్సన్ కూడా నటిస్తోంది. ఈ సినిమాలో సమంత ఓ కూతురికి తల్లిగా నటించబోతోంది.

ఆ కూతురు పాత్రలోనే మీనా తనయ నైనిక నటిస్తోంది. దీంతో బాలనటిగా నైనిక తల్లిని మరిపిస్తుందా చూడాలి. మీనా కూడా బాలనటిగానే సినీ రంగ ప్రవేశం చెసింది.

English summary
Actress Meena's daughter nainika is acting in a Tamil film, which is going to be cast Vijay and Samantha.
Please Wait while comments are loading...