twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీనా 'వెంగమాంబ' చూడచ్చా?

    By Staff
    |

    మీనా ప్రధాన పాత్రలో అన్నమయ్య చిత్ర నిర్మాత దొరస్వామి రాజు నిర్మించిన భక్తి రస చిత్రం వెంగమాంబ శుక్రవారం ఉదయం ఆటతో రిలీజైంది. కీరవాణి పాటల ప్రత్యేక ఆకర్షణతో రిలీజైన ఈ చిత్రం అవి ప్రేక్షకులుకు ఎంతలా ఎక్కుతాయన్న విషయంపైనే విజయం ఆధారపడి ఉంటుందంటున్నారు. ఇక దర్శక, రచయిత ఉదయభాస్కర్ చాలా కాలంగా భాగవతం, శివలీలలు, దత్తాత్రేయ చరితం వంటి ఎన్నో పౌరాణిక టీవీ సీరియల్స్ కు కథ, మాటలు, దర్శకత్వం వహించారు.

    ఉదయ్ భాస్కర్ ఎస్వీ ఛానెల్ కు తీస్తున్న వెంగమాంబ సీరియల్ నే కొద్ది పాటి చెర్పులు మార్పులతో తెరకెక్కించారు. మరో విశేషం ఏమిటంటే అందులోనూ మీనానే ప్రధాన పాత్ర, నిర్మాత దొరస్వామి రాజే. ఇక టేకింగ్ టీవీ సీరియల్ లాగా ఉన్నా కథాపరంగా ఉన్నతమైనది కావటంతో ఒక వర్గానికి బాగా నచ్చుతోందని తెలుస్తోంది. అయితే స్టార్ కాస్టింగ్ లేకపోవటంతో ఓపినింగ్స్ రాబట్టంలో వెనకపడింది. పాటలు క్లిక్ అయి,పబ్లిసిటీ పెంచితే మరింతదగా ప్రజాదరణ పొందే అవకాశం ఉందంటున్నారు.

    అలాగే చిత్రంలో ప్యాడింగ్ ఆర్టిస్టులలో చాలా మంది టీవీ సీరియల్స్ లో పనిచేసేవారు కావటంతో కొంత మైనస్ ఉన్నా వారికీ లైఫ్ ఇచ్చినట్లు ఉంటుందని మెచ్చుకోవటం విన్పిస్తోంది. ఇక పద్మావతి దేవి అంసగా జన్మించి, కవయిత్రిగా 'నృసింహ శతకం', 'విష్ణు పారిజాతం', 'వేంకటాచల మహాత్మ్యం' వంటి ఎన్నో రచనలు చేసిన అపర సరస్వతిగా, అన్నింటికీ మించి శ్రీవారి పవళింపు సేవకు 'ముత్యాల హారతి'ని అందించి ఆ హారతిని నేటికీ ఆనువంశికం చేసిన వెంగమాంబ చరిత్ర తెలుసుకోవటం పుణ్యం, పురుషార్ధం. అయితే అన్నమయ్య చిత్రం అంత హిట్టయ్యే అవకాశం మాత్రం ఈ చిత్రానికి కనపడటం లేదని విశ్లేషకులు అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X