»   » ఇపుడు సెక్స్ వర్కర్‌గా, మిసమిసలాడే మీనాక్షి దీక్షిత్ (ఫోటోస్)

ఇపుడు సెక్స్ వర్కర్‌గా, మిసమిసలాడే మీనాక్షి దీక్షిత్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మిసమిసలాడే అందాల సుందరి మీనాక్షి దీక్షిత్.....గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ‘లైఫ్ స్టైల్' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వత దూకుడు, బాద్ షా చిత్రాల్లో ఐటం సాంగులు చేసి ఆకట్టుకుంది. వెంకీ బాడీగార్డ్, రవితేజ దరువు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసింది. గతేడాది వచ్చిన ‘అడవి కాచిన వెన్నెల' చిత్రంలో హీరోయిన్ గా చేసింది. తమిళం, మళయాలం, కన్నడ చిత్రాల్లోనూ నటించింది.

త్వరలో మీనాక్షి దీక్షిత్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కుందన్ షా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పి సె పిఎం తక్'(ప్రాసిట్యూట్ సె ప్రైమ్ మినిస్టర్ తక్) అనే చిత్రంలో మీనాక్షి దీక్షిత్ లీడ్ రోల్ చేస్తోంది. ఇందులో మీనాక్షి దీక్షిత్ వేశ్య పాత్ర పోషిస్తోంది. తన పాత్ర గురించి మీనాక్షి దీక్షిత్ వివరిస్తూ...‘ఇది ఒక సెక్స్ వర్కర్ కథ. ఒక వేశ్య ప్రధాన మంత్రి ఎలా అయింది అనే కథాంశంతో సినిమా సాగుతుంది' అని తెలిపారు.

‘ఈ సినిమా కోసం నేను చాలా హోం వర్క్ చేసాను. నా పాత్రలో ప్రతిదీ డిఫరెంటుగా ఉంటుంది. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ విషయంలో చాలా ప్రాక్టీస్ చేసాను. వేశ్యల బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవడానికి రెడ్ లైట్ఏరియాలో ఉండే మహిళలతో ఇంటరాక్ట్ అయ్యాను' అని మీనాక్షి దీక్షిత్ వెల్లడించారు.

స్లైడ్ షోలో మీనాక్షి దీక్షిత్‌కు సంబంధించిన లేటెస్ట్ హాట్ ఫోటోలు...

మీనాక్షి దీక్షిత్

మీనాక్షి దీక్షిత్

మీనాక్షి దీక్షిత్ అక్టోబర్ 12 జన్మించింది. వయసు 26. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించింది.

ముంబైలో పెరిగింది

ముంబైలో పెరిగింది

మీనాక్షి దీక్షిత్ ముంబైలో పెరిగింది. చిన్న తనం నుండి స్టోర్ట్స్, అథ్లెటిక్స్ లో యాక్టివ్. కథక్, వెస్టర్న్ డాన్స్ నేర్చుకుంది.

అలా సినీ రంగం వైపు

అలా సినీ రంగం వైపు

2008లో ఎన్డీటీవీ ఇమేజైన్ డాన్స్ రియాల్టీ షో ‘నచ్లే వె విత్ సరోజ్ ఖాన్' షోలో అవకాశం దక్కించుకోవడం ఆమె సినిమా రంగం వైపు రావడానికి కారణమైంది.

తెలుగు సినిమా ద్వారా ఎంట్రీ

తెలుగు సినిమా ద్వారా ఎంట్రీ

తెలుగు మూవీ లైఫ్ స్టైల్ ద్వారా మీనాక్షి దీక్షిత్ హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది.

మోడలింగ్

మోడలింగ్

ఆకట్టుకునే రూపం, ఫిగర్ ఉండటంతో మోడలింగ్ రంగంలో అవకాశాలు వచ్చాయి. అనేక బ్రాండ్లకు ఆమె ప్రచారం చేసారు.

2011లో దూకుడు..

2011లో దూకుడు..

దూకుడు చిత్రంలో స్పెషల్ డాన్స్ నెంబర్లో అప్పియరెన్స్ ఇవ్వడం ద్వారా అందరి దృష్టి మీనాక్షిపై పడింది. తర్వాత బాడీగార్డ్ చిత్రంలోనూ ఓ సాంగ్ చేసింది. మంచి రెస్పాన్స్ రావడంతో తమిళ బిల్లా 2తో పాటు పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేసింది.

అడవి కాచిన వెన్నెల

అడవి కాచిన వెన్నెల

తెలుగులో అడవి కాచిన వెన్నెల చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది.

బాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్ ఎంట్రీ

‘పి సె పిఎం తక్' సినిమా ద్వారా మీనాక్షి దీక్షిత్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి కుందన్ షా దర్శకత్వం వహిస్తున్నారు.

సెక్స్ వర్కర్

సెక్స్ వర్కర్

ఇందులో మీనాక్షి దీక్షిత్ వేశ్య పాత్ర పోషిస్తోంది. తన పాత్ర గురించి మీనాక్షి దీక్షిత్ వివరిస్తూ...‘ఇది ఒక సెక్స్ వర్కర్ కథ. ఒక వేశ్య ప్రధాన మంత్రి ఎలా అయింది అనే కథాంశంతో సినిమా సాగుతుంది' అని తెలిపారు.

English summary
Working with a seasoned director like Kundan Shah in her maiden Bollywood flick was a wonderful opportunity for Meenakshi Dixit who was last seen as a shooter in ‘Adavi Kaachina Vennela’. “What I learnt while working on this film, I will cherish for a lifetime,” says the actress who is playing the lead in the director’s ‘P Se PM Tak’.
Please Wait while comments are loading...