»   » షాకింగ్: చిరంజీవి హీరోయిన్ ఇపుడు ఇలా... (ఫోటోస్)

షాకింగ్: చిరంజీవి హీరోయిన్ ఇపుడు ఇలా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోని గొప్ప సినిమాల్లో ‘ఆపద్భాంధవుడు' సినిమా ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ నటి మీనాక్షి శేషాద్రి చాలా కాలంగా ఎవరికీ కనిపించడం లేదు. అభిమానులు కూడా ఆమెను దాదాపుగా మరిచి పోయారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె ముంబైలో దర్శనమిచ్చారు. ఆమె ముంబై వచ్చింది ఓ పంక్షన్ లో పాల్గొనడానికి, తనకు సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసారు.

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ట్విట్టర్ ద్వారా మళ్లీ ఆమెను ఇండియన్ సినీ అభిమానుల ముందుకు తెచ్చారు. ఒకరకంగా సినీ అభిమానులకు పరీక్ష పెట్టారు. ఆమెతో దిగిన ఫోటో ఒకటి పోస్టు చేసిన రిషి కపూర్.....నేను అసలు ఆమెను తొలుత గుర్తుపట్టలేక పోయాను. మరి మీరైనా గుర్తు పట్టండి అంటూ ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు టెస్టు పెట్టారు. 30 నిమిషాల తర్వాత ఆమె మరెవరో కాదు మీనాక్షి దీక్షిత్ అంటూ తెలియజేసారు.

 Meenakshi Seshadri visits Rishi Kapoor unannounced

మైసూరుకు చెందిన హరీష్‌ను పెళ్లాడిన మీనాక్షి... ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అమెరికాలోని డల్లాస్‌లో సెటిలయ్యారు. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప. చాలా సంతోషంగా జీవిస్తున్నారు. మంచి పాత్ర దొరికితే నటించడానికి మీనాక్షి సిద్దమే అంటూ రిషి కపూర్ కామెంట్ చేసారు. రిషి కపూర్‌తో కలిసి మీనాక్షి నటించిన బాలీవుడ్ మూవీ ‘దామిని' అప్పట్లో మంచి విజయం సాధించింది.

తెలుగులో ఆమె చిరంజీవితో నటించిన ‘ఆపద్భాంధవుడు' చిత్రం తెలుగు సినిమా జనాల్లో ఎప్పటికీ అలా నిలిచి పోతుంది. ఇప్పటికీ ఆమెలో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు కదూ...! చాలా కాలం తర్వాత ఇండియా వచ్చిన ఈ మెగా హీరోయిన్‌కు ఒక సారి ఓహో.... యేసుకోండి!

English summary
Actress Meenakshi Seshadri visits Rishi Kapoor unannounced.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu