»   » తేల్చి చెప్పింది :పవన్ తో షూటింగ్ చాలా కష్టం, చాలా ఇబ్బంది

తేల్చి చెప్పింది :పవన్ తో షూటింగ్ చాలా కష్టం, చాలా ఇబ్బంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మీరా చోప్రా మళ్లీ ఎమ్ ఎస్ రాజు వాన చేసింది. వాన అనుకున్నట్లు కురవకపోవటంతో ఆమె తెలుగు నుంచి తెరమరుగైంది. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు మీడియాలో ఆమె టాపిక్ వచ్చింది. అందుకు కారణం ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వూ.

  మీరా చోప్రా తన తాజా చిత్రం లండన్..1920 ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ తో పనిచేయటం చాలా కష్టం అని చెప్పింది. అంటే పనవ్ ఏదో ఆమెను ఇబ్బంది పెట్టారని కాదు..షూటింగ్ సమయంలో జరిగిన విషయం చెప్తూ... ఎందుకు ఇబ్బంది ఫీలైందో చెప్పింది.

  ఇటీవలే ఆమె నటించిన రెండో బాలీవుడ్ చిత్రం 1920 లండన్ విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో. పవన్ కల్యాణ్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఓ బాలీవుడ్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.

  ఆ ఆసక్తికర సమాధానాన్ని ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. స్లైడ్ షో చూడండి...

  సూపర్ క్రేజ్

  సూపర్ క్రేజ్

  "నేను బాలీవుడ్ టాప్ హీరోలైన సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లతో ఇప్పటి దాకా పని చేయలేదు. కాబట్టి వారికున్న క్రేజ్ పై నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు. కానీ, తెలుగులో పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో పని చేశాను కాబట్టి ఆయనకున్న సూపర్ క్రేజ్ గురించి నేను కచ్చితంగా చెప్పగలను.

  అర్దమైంది

  అర్దమైంది

  దక్షిణాదిన హీరోలను అభిమానులు దేవుళ్లలా ఎలా ఆరాధిస్తారో పవన్ కల్యాణ్ క్రేజ్ ను చూసిన తర్వాత నాకు అర్థమైంది.

  తమిళనాడులో పెట్టాడు

  తమిళనాడులో పెట్టాడు

  పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ ను ఆంధ్రప్రదేశ్ లో జరిపితే, తొక్కిసలాటలు జరగడం ఖాయమనే ఉద్దేశంతో దర్శకుడు ధరణి ఈ సినిమా షూటింగ్ ను తమిళనాడులోని ఓ మారుమూల పల్లెటూల్లో పెట్టారు.

  చిన్న ఇంట్లో వసతి

  చిన్న ఇంట్లో వసతి

  ఆ ఊళ్లో ఎలాంటి స్టార్ హోటల్స్ లేకపోవడంతో ఓ చిన్న ఇంట్లో మాకు వసతి ఏర్పాటు చేయబడింది.

  ఎలా లీకైందో కానీ..

  ఎలా లీకైందో కానీ..

  అయితే, ఎలా లీకయిందో తెలియదు కానీ.. పవన్ కల్యాణ్ అక్కడ ఉన్నట్టు చాలా మందికి తెలిసిపోయింది.

  తిరునాళ్లలా

  తిరునాళ్లలా

  దీంతో.. మేం ఉన్న ఇంటి చుటూ సడెన్గా సుమారు పదివేల మంది చేరిపోయారు. పవన్ కల్యాణ్ ను చూడటం కోసం అదే పనిగా వెయిట్ చేయడం ప్రారంభించారు.

  ఎంతదారుణమంటే

  ఎంతదారుణమంటే

  పరిస్థితి ఎంతదారుణంగా తయారయిందంటే.. పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ఆ ఇంటి నుంచి బయటకు రాలేకపోయారు.

  అనేకసార్లు కాన్సిల్

  అనేకసార్లు కాన్సిల్

  అభిమానుల తాకిడి కారణంగా అప్పట్లో 'బంగారం' షూటింగ్ అనేక మార్లు క్యానిల్స్ అయ్యింది.

  ప్రత్యక్ష్యంగా చూసా

  ప్రత్యక్ష్యంగా చూసా

  న్యూయార్క్లో పెరిగిన నాకు దక్షిణాది హీరోలను దేవుళ్లుగా కొలుస్తారని తెలుసు! అయితే పవన్ కల్యాణ్ తో నటించడం ద్వారా ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడగలిగా" అని మీరా చోప్రా వ్యాఖ్యానించింది.

  ఫోకస్ ఇక్కడే

  ఫోకస్ ఇక్కడే

  అయితే పేరు.. డబ్బు తెచ్చిన టాలీవుడ్‌ మాత్రం తనకి సంతోషాన్ని ఇవ్వలేదని.. ఇకపై బాలీవుడ్‌పైనే ఫోకస్‌ చేస్తానని చెప్పుకొచ్చింది.

  ఆత్మ సంతృప్తి లేదు

  ఆత్మ సంతృప్తి లేదు  తెలుగు లో నటిస్తున్నప్పటికీ తనకు ఆత్మసంతృప్తి లేదని డబ్బు వస్తున్నంత మాత్రాన సంతృప్తి లేని పని చేయడం తనకు ఇష్టం లేదని అంటుందీ ఈ హాట్ బ్యూటీ.

  ఇక్కడే హ్యాపీ

  ఇక్కడే హ్యాపీ


  అయితే బాలీవుడ్‌లో నటించడం సంతోషంగా ఉంది. సొంత ఇంట్లో ఉన్న భావన కలుగుతుంది'అని చెప్పుకొచ్చింది.

  తక్కువైనా చేస్తాను

  తక్కువైనా చేస్తాను

  అంతే కాదు తన మాతృభాష పంజాబీలోనూ నటించాలని ఉందని అంటోంది. రెమ్యునరేషన్‌ తక్కువ ఇచ్చినా పంజాబీలో నటిస్తే సంతృప్తి దొరుకుందని చెబుతోంది.

   అంతే కాదు తన గురించి చెబుతూ..

  అంతే కాదు తన గురించి చెబుతూ..

  "సినిమానే ప్రపంచం కాదు. దాన్ని మించిన లోకం చాలా పెద్దది. ఖాళీ సమయల్లో నేను తీరిగ్గా గోళ్లు గిల్లుకుంటూ కూచోను.

  బిజినెస్ ఉమెన్ గా

  బిజినెస్ ఉమెన్ గా

  నాకు నచ్చిన హోటల్ ఇండస్ట్రీలో దిగాను. అన్ని నగరాల్లో నా బ్రాండ్ పేరుతో చెయిన్ ఆఫ్ హోటళ్లను ప్రారంభించాలన్నది నా చిరకాల వాంఛ" అని చెప్పింది.

  rn rn

  ట్రైలర్ గా

  తాజాగా '1920 లండన్‌' చిత్రంతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

  English summary
  "I have not worked with a Bollywood superstar like Shah Rukh Khan or Salman Khan yet, so I can't comment on what kind of fan following do they have, but I can talk about Pawan Kalyan for sure," Meera Chopra said. "With Pawan Kalyan, you can't work in Andhra Pradesh as that would result in a stampede. It was our director's call to shoot for the film at a small village in Tamil Nadu. For some reason, everybody came to know that Pawan Kalyan is here to shoot for a film," Meera said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more