»   » వైరల్ పిక్స్ : అందాల మీరా జాస్మిన్ ఇలా మారిపోయిందేంటి..షాకిస్తున్న లేటెస్ట్ లుక్!

వైరల్ పిక్స్ : అందాల మీరా జాస్మిన్ ఇలా మారిపోయిందేంటి..షాకిస్తున్న లేటెస్ట్ లుక్!

Subscribe to Filmibeat Telugu
Look how Meera Jasmine is now, shocking

అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన దేహంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్నా మీరా జాస్మిన్ గత కొంత కాలంగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. చాలా కాలం పాటు మీరా టాప్ హీరోయిన్ల లీగ్ లో కొనసాగింది. 2016 నుంచి వెండి తెరపై కనిపించడం లేదు. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. మీరా తాజాగా ఓ జ్యువెలరీ షాప్ లో మెరిసింది. మీరా లేటెస్ట్ లుక్ , ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 అమ్మాయి బాగుందితో ఎంట్రీ

అమ్మాయి బాగుందితో ఎంట్రీ

మీరా జాస్మిన్ సూపర్ హిట్ చిత్రం అమ్మాయి బాగుందితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తెలుగు వారిని మీరా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మీరాకు ఫిదా అయిపోయారు.

పవర్ స్టార్ సరసన ఛాన్స్

పవర్ స్టార్ సరసన ఛాన్స్

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఆవకాశం కొట్టేసింది ఈ భామ. గుండుంబా శంకర్ చిత్రంలో పవన్ కళ్యాణ్, మీరాజాస్మిన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

 భద్రతో మెమొరబుల్ హిట్

భద్రతో మెమొరబుల్ హిట్

ఆ తరువాత మీరా జాస్మిన్ రవితేజ సరసన భద్ర చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మీరా అద్భుత నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ కు భద్ర చిత్రం చాలా చిరస్మరణీయమైనది. రవితేజ కూడా తన కెరీర్ లో బెస్ట్ మూవీగా భద్ర పేరే చెబుతాడు.

 చూడ చక్కనైన రూపం

చూడ చక్కనైన రూపం

స్వతహాగా మలయాళీ అయిన మీరా జాస్మిన్ సినిమాల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా అలరించింది. చీర కట్టులో ఆమె అందానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యే వారు.

నో గ్లామర్ షో

నో గ్లామర్ షో

ఎంత క్రేజ్ వచ్చినా మీరా జాస్మిన్ ఎప్పుడూ గ్లామర్ షో పాత్రలు వేయలేదు. ఆ తరహా పాత్రలకు మీరా పూర్తిగా వ్యతిరేకం.

షాకిస్తున్న లేటెస్ట్ లుక్

షాకిస్తున్న లేటెస్ట్ లుక్

మీరా జాస్మిన్ తాజగా ఓ జ్యువెలరీ షాప్ లో మెరిసింది. బాగా బొద్దుగా తయారైన ఉన్న మీరాని చూడ గానే పోల్చుకోవడం కాస్త కష్టమే. బొద్దుగా ఉన్న కూడా చీర కట్టులో మీరా జాస్మిన్ అందంగానే కనిపిస్తోంది.

 పెళ్లయ్యాక సినిమాకు దూరం

పెళ్లయ్యాక సినిమాకు దూరం

అనిల్ జాన్ అనే వ్యక్తిని మీరా జాస్మిన్ 2014 లో వివాహం చేసుకుంది. మీరా చిరవరగా 2016 లో ఓ మలయాళీ చిత్రంలో మెరిసింది. ఆ తరువాత మీరా జాస్మిన్ వెండి తెరకు దూరమైంది.

English summary
Meera Jasmine latest look gives shock. After long time Meera jasmine appears at jewellery shop
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu