»   » మన సినిమాలని హీటెక్కిస్తున్న విదేశీ భామలు(ఫోటో ఫీచర్)

మన సినిమాలని హీటెక్కిస్తున్న విదేశీ భామలు(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: గ్లోబులైజేషన్ పుణ్యమా అని ఎక్కడి వారి ఎక్కడైనా నిరూపించుకునే అవకాశాలు పెరిగాయి. ఇండియన్ నటీనటులు హాలీవుడ్ వైపు చూస్తుంటే...విదేశాల్లో ఉన్నవారు మన తెరపై వెలగటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఇక్కడ కనిపించే వారంతా విదేశాల్లో పుట్టి పెరిగినవారే. కొందరు పూర్తిగా విదేశీయులైతే కొందరిలో ప్రవహించేది భారతీయ రక్తమే. ఈ ఒక్క కారణం చాలు మన వెండితెరపై కనిపించడానికి. దానికి కొంత అదృష్టం కూడా తోడైందండోయ్‌.

  నటనలో కొంత మెళకువలు నేర్చుకుని ఇంకొంత కష్టపడ్డారేమో. బాలీవుడ్‌ వారికి అవకాశాలు కల్పించింది. నటనకు అవకాశం ఉండే పాత్రలే కావచ్చు.. ఐటం సాంగ్స్‌లో వయ్యారాలు ఒలకబోసే అవకాశమే కావచ్చు.. ఏదైతేనేం ఈ వనితలకు హిందీ చిత్రసీమ తలుపులు బార్లా తెరిచింది.

  స్లైడ్ షోలో విదేశీ భామల అంద చందాలు...

  జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌

  జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌

  ఈమె శ్రీలంక నటి. 2006లో మిస్‌ శ్రీలంక యూనివర్స్‌ కిరీటం చేజిక్కించుకుంది. 2009లో సుజయ్‌ ఘోష్‌ చిత్రం అలాదీన్‌ ద్వారా బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది. ఇటీవలే 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో ప్రభుదేవాతో కలసి ఒక ఐటం సాంగ్‌ చేసింది.

  నర్గీస్‌ ఫక్రీ

  నర్గీస్‌ ఫక్రీ

  నర్గీస్‌ ఫక్రీ అమెరికన్‌ నటి. ఈమె రాక్‌స్టార్‌ రణబీర్‌ కపూర్‌తో కలసి బాలీవుడ్‌ సినిమాలో నటించింది. అక్షయ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని హరి ఓం ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో రానున్న మూడు సినిమాల్లో నటించనుంది. ఉదయ్‌ చోప్రాతో కలసి డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం ఉంది.

  బార్బరా మోరి

  బార్బరా మోరి

  మెక్సికన్‌ నటి. హృతిక్‌రోషన్‌ సరసన 'కైట్స్‌' చిత్రంలో కన్పించారు. ఇందులో హృతిక్‌ బార్బరామోరిల కెమిస్ట్రీ బాగుందని సినీవర్గాల కథనం.

  యానాగుప్తా

  యానాగుప్తా

  జెకోస్లవేకియా దేశస్తురాలు. 11కుపైగా చిత్రాల్లో నటించారు. 'బాబూజీ జరా ధీరే చలో' అనే ఐటం సాంగ్‌ ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

  సన్నీలియోన్

  సన్నీలియోన్

  ఇండో-కెనడియన్‌ అశ్లీల చిత్రాల తార. 'బిగ్‌బాస్‌' ద్వారా ఆరంగేట్రం చేసింది. జిస్మ్‌-2 ద్వారా బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది. రాగిణి ఎస్‌.ఎం.ఎస్‌.-2తోపాటు 'లైలా' ఐటం సాంగ్‌ ద్వారా అలరిస్తోంది.

  కత్రినాకైఫ్‌

  కత్రినాకైఫ్‌

  ఇండో-బ్రిటిష్‌ నటి. ఈమెను బాలీవుడ్‌లో బార్బీ డాల్‌గా పిలుస్తారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌, సల్మాన్‌ఖాన్‌తో కలసి పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించింది. రణబీర్‌తో కలసి డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  అమీ జాక్సన్

  అమీ జాక్సన్

  బ్రిటిష్‌ అందాలరాణి. మోడల్‌ నుంచి నటిగా ఎదిగి 'ఏక్‌ దీవానా థా' చిత్రం ద్వారా బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది.తెలుగు, తమిళ చిత్రాల్లోనూనటిస్తోందీ అందాల భామ.

  English summary
  They are picture perfect and they are all trying to fit into the Bollywood frame. Foreign beauties are enjoying a popular spell in Hindi films and also on TV now. Katrina Kaif started an epoch of foreign imports in Bollywood. The half Kashmiri, half British glam queen has ruled audience fantasy for a decade now and her phenomenal rise soon saw filmmakers go hunting for other exotic beauties.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more