»   » ఇక మెగా ట్వీట్స్..... ట్విటర్ లో ఖాతా ఓపెన్ అయ్యింది

ఇక మెగా ట్వీట్స్..... ట్విటర్ లో ఖాతా ఓపెన్ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ బాబుకి మామూలుగా కోపం రాదు.., మరీ ఆవేశంగా కనిపించరు కానీ అవన్నీ చెతిలోకి మైక్ వచ్చే దాకానే ఒక్కసారి మైక్ పట్టుకుంటే గానీ నాగ బాబు ఎలా విరుచుకు పడతారో అర్థం కాదు. అందులోనూ ఆయన అన్నయ్య చిరు మీద ఈగ వాలినా తట్టుకోరు. ఇంక ఏ సభలో అయినా మైక్ చేతికొచ్చినప్పుడు చిరు గురించి గానీ, మెగా ఫ్యామిలీ గురించి గానీ ఏ చిన్న విషయంలో చికాకు పెట్టిన వాళ్ళు గుర్తొచ్చారా ఇంక అంతే.

ఇలాగే ఒకసారి స్టేజ్ మీద నుండే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు క్లాస్ తీసుకున్నారు.. ఇంకో సారి మెగా ఫంక్షన్స్ లో అలా చేస్తే మర్యాదగా ఉండదని పవర్స్టార్ కి అన్నయ్య హోదాలోనే వాళ్ళకి చీవాట్లు పెట్టారు. ఆ తరువాత... ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతటి రచ్చ చేసాయో తెలిసిందే కదా. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై, పైనా రచయిత యండమూరి మీదా నాగబాబు తనదైన శైలిలో చెలరేగిపోయారు!

Mega Brother Naga Babu joins twitter

అయితే ఇన్నాళ్లూ ఎవరికైనా ఏదైనా సందేశం ఇవ్వాలంటే... నాగబాబుకు ఏదో ఒక వేదిక దొరికేవరకూ ఆగాల్సి వచ్చేది. అయితే తాజాగా తన వాదన వినిపించడానికి ఇప్పుడో కొత్త వేదికపైకి మెగా బ్రదర్ వచ్చారు. కొత్త వేదిక అంటే అందరికీ పత వేదికే గానీ నాగ బాబు కొత్తగా అక్కడికి వచ్చారు. అదే ట్విట్తర్ లో ఖాతా తెరిచాడు ఈ మెగా సోదరుడు. ఈ అకౌంట్ జనవరి 26 నే తెరిచినా ఫేక్ ఎకౌంట్ కాబోలు అని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోక పోవటం తో తానే స్వయంగా ఒక వీడియో షేర్ చేసారు.

సోషల్ మీడియాలో ఇన్నాళ్లూ కాస్త సైలెంట్ గా ఉన్న నాగబాబు నాగబాబు మొన్నటి ఏపిసోడ్ లో వర్మ మాటలకు కాస్త సీరియస్ అయినట్టునారు. అందులోనూ... "మీకు ట్విట్టర్ అకౌంట్ లేదు కదా చూసిన వాళ్ళు చెప్తారు" అన్న మాటలకు హర్టయ్యారేమో ఇప్పుడు ట్విట్టర్ లో ఖాతా తెరిచారు. తాను ట్విట్టర్ లోకి వస్తున్నా.. అని ప్రకటించడంతో అందరికీ ఆర్జీవీ గుర్తొస్తున్నారు.

ట్విట్టర్ వేదికగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటూ నాగబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ లాంటి వాళ్లకు ఠక్కున సమాధానాలు చెప్పేందుకే నాగబాబు ఇప్పటికిప్పుడు ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారని అనుకుంటున్నారు. అయితే ఇంకా రామ్ గోపాల్ వర్మ ఈ న్యూస్ విన్నాడంటారా..? వింటే మాత్రం సైలెంట్గా ఉంటాడా... ఏదో ఒక పోస్ట్ పెట్టి మళ్ళీ నాగ బాబుని కెలికే ప్రయత్నం చేస్తాడేమో కదా

English summary
Mega brother Naga Babu joined the micro-blogging site Twitter now. Though his account was active since 26th January and he tweeted regarding AP special status but few doubted that it is fake account . So Naga Babu shared a video today and confirmed the news that he is active on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu