Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Roja Vs Nagababu: రోజాకూ, దానికి తేడా లేదు.. నువ్వు ఆ పనులు చేయడం కాదు.. తొలిసారి ఆమెపై షాకింగ్‌గా!
సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇప్పటి నుంచే ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. అలాంటిది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై పోరాటం చేస్తుండడంతో అవి ఇంకాస్త రంజుగా మారాయి. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ప్రజల తరపున పోరాటం చేస్తోన్న ఈ స్టార్ హీరో.. తరచూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి రోజా మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు తాజాగా నాగబాబు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!

మెగా బ్రదర్స్‌పై సంచలనంగా
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పవన్‌కు అసలు మానవత్వం లేదు. ఎమోషన్స్ లేవు. ఆయన నా తోటి ఆర్టిస్టు అయినందుకు సిగ్గుపడుతున్నాను. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి వాళ్లు తమకు గొప్ప జీవితాన్ని ఇచ్చిన ప్రజలకు సేవ చేశారు' అన్నారు.
జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

అందుకే ముగ్గురినీ ఓడించారు
అనంతరం రోజా మాట్లాడుతూ.. 'చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులు తమను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు చిన్న సహాయం చేయలేదు. అంతెందుకు వీళ్లు ముగ్గురూ సొంత జిల్లాకు ఏమీ చేయలేదు. అందుకే అన్నదమ్ముల ముగ్గురినీ సొంత నియోజకవర్గ ప్రజలే ఓడించారు. రాజకీయాల్లో ఈ ముగ్గురికి అసలు భవిష్యత్ అనేది లేదు' అంటూ కామెంట్స్ చేశారు.

రోజాకు నాగబాబు స్ట్రాంగ్ రిప్లై
మంత్రి రోజా తమ బ్రదర్స్‌పై చేసిన కామెంట్లకు నాగబాబు స్పందిస్తూ ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో ఆయన 'మంత్రి రోజా.. భారతదేశ పర్యాటకశాఖ ర్యాంకింగ్స్‌లో ఉన్న 20 స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్‌లు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 18లో ఉంది. నువ్వు ఇలాగే బాధ్యత లేకుండా ఉంటే మరింత దిగజారి 20కి చేరుతుంది' అని హెచ్చరించారు.
బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

వాళ్ల పరిస్థితి దిగజారుతుంది
ఆ తర్వాత నాగబాబు కొనసాగిస్తూ.. 'ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. కాబట్టి నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు' అని చెప్పారు.

నీ పర్యటనలు కాదు అంటూ
రోజా పర్యాటక మంత్రిగా సరిగా బాధ్యతలు నిర్వర్తించడం లేదని విమర్శించిన మెగా బ్రదర్ నాగబాబు.. 'ముందు పర్యాటశాఖ మంత్రిగా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకో. ఒక రాష్ట్రానికి పర్యాటకశాఖ మంత్రి అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా పర్యటనలు చేయడం కాదు. పర్యాటకశాఖను ఎలా డెవలప్ చేయాలో చూడాలి. ముందు దీనిపై దృష్టి పెట్టు' అని సూచించారు.
నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!
|
నీ మాటలకు రియాక్ట్ కాలేదు
ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. 'నువ్వు ఇన్ని రోజులు మా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ గురించి నోటికొచ్చినట్లు వాగావు. అఫ్‌కోర్స్ నా గురించి కూడా మాట్లాడావు. అయినా నేను లెక్క చేయలేదు. ఆ తర్వాత కూడా పవన్, మా అన్నయ్య గురించి మాట్లాడావు. అయినా కూడా నేను ఎందుకు రియాక్ట్ కాలేదు' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

చెత్తకుప్పకు నీకు తేడా లేదు
చివర్లో
మెగా
బ్రదర్
రోజాపై
షాకింగ్
కామెంట్స్
చేశారు.
'నువ్వు
ఎంత
వాగినా
నేను
రియాక్ట్
కాకపోవడానికి
ఒకటే
కారణం
ఉంది.
అది
ఏంటంటే
నీ
నోటికి,
మున్సిపాలిటీ
కుప్పతొట్టికి
పెద్ద
తేడా
లేదు.
చూస్తా
చూస్తా
మున్సిపాలిటీ
కుప్పతొట్టిని
గెలకరు.
ఇప్పటికైనా
బుద్ధి
తెచ్చుకుని
పర్యాటకశాఖను
ఎలా
డెవలప్
చేయాలో
చూడు'
అంటూ
నాగబాబు
స్ట్రాంగ్
రిప్లైను
ఇచ్చారు.