»   » మెగా క్యాంపు సపోర్టు: ఈ ఫోటోయే సాక్ష్యం!

మెగా క్యాంపు సపోర్టు: ఈ ఫోటోయే సాక్ష్యం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' అధ్యక్ష పదవికి ఈ నెల 29న ఎన్నికలు జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల విషయంలో తెలుగు సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. అందులో ఒకటి చిరంజీవి వర్గం కాగా...మరొకటి దాసరి వర్గం. రాజేంద్రప్రసాద్, జయసుధ ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. రాజేంద్రప్రసాద్‌కు చిరంజీవి వర్గం మద్దతు ఇస్తుండగా, జయసుధను దాసరి వర్గం సపోర్టు చేస్తోంది.

ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా రాజేంద్రప్రసాద్ పలువురు ఆర్టిస్టులతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఓ మా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ చిరంజీవి ఇంటికి వెళ్లి కలవడం హాట్ టాపిక్ అయింది. మెగావర్గం రాజేంద్రుడిని అద్యక్షుడిని చేసేందుకు వెన్నుదన్నుగా నిలుస్తుందనడానికి ఈ సంఘటనే నిదర్శనమని అంటున్నారు.

 Mega camp supports Rajendraprasad

సినీ పెద్దలు, సంఘ సభ్యులు తనకు సహకారం అందిస్తున్నందునే ‘మా' అధ్యక్షునిగా ఉండేందుకు నిర్ణయించుకున్నానని రాజేంద్రప్రసాద్‌ ఈ నెల 2న పత్రికా సమావేశంలో ప్రకటించారు. ముప్పై ఏడేళ్లుగా సినీ రంగంలో ఉన్న తాను, ఇదే రంగంలో ఉన్న కళాకారులకు ‘మా' అధ్యక్షుడిగా తన వంతు సేవ అందించాలనుకుంటున్నానని తెలిపారు. అయితే రాజేంద్రప్రసాద్ వస్తే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో మెగా క్యాంపు ఆధిపత్యం పెరిగిపోతుందని భావించిన దాసరి వర్గం జయసుధను రంగంలోకి దింపినట్లు చర్చించుకుంటున్నారు.

అధ్యక్షుడిగా నటుడు రాజేంద్రప్రసాద్‌ ఏకగ్రీవ ఎన్నిక ఖాయమనుకుంటున్న దశలో, ఆఖరి నిమిషంలో నటి జయసుధ ఆయనకు పోటీగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. అసలు ఉన్నట్టుండి జయసుధను తెరపైకి తెచ్చింది దాసరి వర్గమే అనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ జయసుధకు మద్దతు ప్రకటించారు. నాగబాబు ప్రెస్ మీట్ పెట్టిమరీ రాజేంద్రప్రసాద్ ను బల పరిచారు.

మూవీ అసోషియేషన్‌కు జరుగుతున్న ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా అయ్యేటట్లు చూస్తామని ‘మా' అధ్యక్షుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ తెలిపారు. దాసరి నారాయణరావు లాంటి పెద్దల సాయం కూడా తీసుకుంటామని అన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యాక అందరితో చర్చించి, ఏకగ్రీవానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

English summary
Nata Kireeti Rajendra Prasad has now been challenged by Sahajanati Jayasudha for the post of president at the Movie Artists Association ( MAA). There is news that Rajendra Prasad is getting support from mega camp while Jayasudha is having the backing of Murali Mohan himself. Here's wishing the best of luck to both.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu