For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భర్త కారణంగా నటనకు దూరంగా ఉన్నా.. ఓపెన్ గా నిజాన్ని బయటపెట్టిన నిహారిక!

  |

  మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత నటనకు దూరమైన విషయం తెలిసిందే.. అంతకుముందు వెబ్ సిరీస్ లో అలాగే పలు సినిమాల్లో హీరోయిన్ కూడా నటించింది. అయితే ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ అవ్వలేకపోయాయి.. యాక్టింగ్ విషయంలో మాత్రం నిహారిక ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నచ్చిన పాత్రలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటూ వచ్చింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక సినిమాలు చేయకపోవడానికి తన భర్తే కారణం అంటూ చాలా ఓపెన్ గా ఒక వివరణ ఇచ్చింది.

  సినిమా నటిగా..

  సినిమా నటిగా..

  మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక మొదట రియాలిటీ షోలలో హోస్టింగ్ చేసి అనంతరం వెబ్ సిరీస్ ద్వారా నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. ఆ తర్వాత ఆమెకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ వీలైనంత వరకూ తనకు తనకి సెట్ అయ్యే క్యారెక్టర్లను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ వస్తోంది. ఇక నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఒక మనసు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమాతో ఆమె నటనకు సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.

  మెగాస్టార్ సినిమాలో కూడా..

  మెగాస్టార్ సినిమాలో కూడా..

  తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాల్లో నిహారిక అవకాశాలు అందుకుంది. కానీ అటువైపు ఆమె ఎక్కువగా ఫోకస్ చేయలేదు. 2018లో విజయ్ సేతుపతికి సంబంధించిన ఒక సినిమా లో ఒక చిన్న పాత్రలో నటించింది. ఒక పెళ్లికి ముందు 2019లో సూర్యకాంతం సినిమాలో మెయిన్ లీడ్ లో నటించి మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక ట్రైబల్ అమ్మాయిగా హై వోల్టేజ్ పాత్రలతో కనిపించింది.

  పెళ్లి తరువాత నటనకు దూరంగా

  పెళ్లి తరువాత నటనకు దూరంగా

  ఇక ముద్ద పప్పు ఆవకాయ, నాన్న కూచి, మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నిహారిక ప్రధాన పాత్రల్లో నటించి నటిగా మంచి క్రేజ్ అందుకుంది.. ఇక 2020 డిసెంబర్ 9న నిహారిక చైతన్య జొన్నలగడ్డ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఉదయపూర్ లో జరిగిన ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా నిహారిక సినిమాలు చేయాలని అనుకుంది. కానీ ఆ తర్వాత మళ్లీ ఒక వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటించడం లేదు.

   భర్త కారణంగా..

  భర్త కారణంగా..

  ఇటీవల ఆలీతో సరదాగా టాక్ షోలో ఆమె నటించక పోవడానికి గల కారణాలు కూడా వివరించింది. తను మళ్లీ నటిగా బిజీ కాకపోవడానికి తన భర్తే కారణం అని, నేను నటించడం చైతన్య కు ఏమాత్రం ఇష్టం లేదని కూడా తెలియజేసింది. అయితే అతనికి పూర్తిగా ఇష్టం లేదు అని కాదు.. కానీ కాస్త సెలెక్టివ్ గా మంచి పాత్రలు చేస్తే బావుంటుంది అని కూడా సలహాలు ఇచ్చినట్లు తెలిపింది. త్వరలోనే ఒక వెబ్ సిరీస్ ద్వారా మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు నిహారిక వివరణ ఇచ్చింది.

  మెగా బ్రదర్స్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం

  మెగా బ్రదర్స్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టం

  ఇక ఆసక్తికరంగా మెగా బ్రదర్స్‌లో చిరంజీవి, నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ లలో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు అని నిహారికను అలీ అడిగాడు. ఇక నిహారిక ఆ ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. నేను మా నాన్నను ప్రేమిస్తున్నాను. నాకు కూడా పెద్దనాన్న, బాబాయ్ అంటే చాలా ఇష్టం.. అంటూ అందరిలోను ఒకే అనుబంధం ఉంటుందని నిహారిక తెలియజేసింది.

  English summary
  Mega daughter Niharika about her acting career
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X