»   » మెగా ఫ్యామిలీ 6 లక్షల విరాళం, మిగతా హీరోలు ముందుకొస్తారా?

మెగా ఫ్యామిలీ 6 లక్షల విరాళం, మిగతా హీరోలు ముందుకొస్తారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' కోసం మెగా ఫ్యామిలీ హీరోల నుండి ఇప్పటి వరకు రూ. 6 లక్షల విరాళం అందించింది. రామ్ చరణ్ 2 లక్షలు, అల్లు అర్జున్ 2 లక్షలు, వరుణ్ తేజ్ 1 లక్ష, సాయి ధరమ్ తేజ్ 1 లక్ష విరాళం అందించారు. రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నాగబాబు ఇందుకు సంబంధించిన చెక్ రాజేంద్రప్రసాద్ కు అందించారు.

ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతూ కోట్లు సంపాదిస్తున్న ఇతర హీరోలు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం విరాళాలు అందిస్తే బావుటుందని, విరాళాలే ఇవ్వడం ద్వారా పేదకళాకారులకు సహాయం చేసిన వారవుతారని పలువురు ఆర్టిస్టులు అభిప్రాయ పడుతున్నారు.

 Mega family donated Rs 6 lakhs to MAA

ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ...పేద కళాకారులకు మంచి చేయాలనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసానని, సంకల్పబలమే మమ్మల్ని ముందుకు నడిపించిందని చెప్పుకొచ్చారు. కార్పస్ ఫండ్, పెన్షన్ డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారనే ఆందోళన అవసరం లేదు. నాగబాబుగారు విరాళంతో మొదలు పెట్టారు. విదేశాల్లోని మిత్రులు కూడా విరాళాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకొస్తాం..అన్నారు. త్వరలోనే జనరల్ బాడీ మీటింగు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

English summary
Mega Brother Naga Babu on Sunday announced that Rs 6 lakhs will be donated to Movie Artist Association on behalf of Mega family.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu