»   » ఇక పండగే....6 వారాల్లో 4 మెగా హీరోల సినిమాలు

ఇక పండగే....6 వారాల్లో 4 మెగా హీరోల సినిమాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే సమయం దగ్గర పడింది. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆరు వారాల గ్యాపులో 4 మెగా హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఎక్కడ చూసినా మెగా అభిమానుల సందడే కనపడబోతోంది.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రాత్మక మూవీ ‘రుద్రమదేవి' సెప్టెంబర్ 4నే విడుదలవుతోంది. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో అతని పాత్ర హైలెట్ కానుంది. అంతే కాకుండా ఈ చిత్రానికి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఇక మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా కూడా సెప్టెంబర్ నెలలలోనే విడుదలవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది.

Mega family stars movies release dates

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె' చిత్రం అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. వరుణ్ తేజ్ తన తొలి సినిమా ‘ముకుంద'తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘కంచె' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

దీని తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రస్తుతం ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ దశలో ఉంది. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

English summary
It's going to be a celebration time for mega fans across the globe in upcoming months as four movies of Mega stars are releasing with a short gap of just six weeks.
Please Wait while comments are loading...