»   » "అన్నయ్య" ఇలా చేస్తాడనుకోలేదు... చిరు మీద అలక, కోపంలో మెగా ఫ్యాన్స్

"అన్నయ్య" ఇలా చేస్తాడనుకోలేదు... చిరు మీద అలక, కోపంలో మెగా ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి బర్త్ డే ప్రతీ సంవత్సరం ఒక మెగా అభిమాని పండగలా ఎదురు చూసే రోజు. తమ సొంత బర్త్ డేని పట్టించుకుంటారో లేదో కానీ "అన్నయ్య" పుట్టిన రోజుకోసం మాత్రం ఎదురు చూస్తూంటారు మెగా ఫ్యాన్స్. ఇప్పుడు కాదు దాదాపు గత ఇరవయ్యేళ్ళనుంచీ ఇదే ఒక సాంప్రదాయంగా వస్తోంది. "అన్నయ్య క్షేమం కోసం... పూజలూ, రక్త దానాలూ సేవా కార్యక్రమాలు చేస్తూ.. ఆ ఒక్క రోజు జరిగే మెగా ఈవెంట్ లో తమ అభిమాన హీరోని చూడటానికి వస్తారు....

చిరంజీవి లగ్జరీ పార్టీ

అయితే ఈసారి 61 జన్మ దిన వేడుకల్లో మాత్రం అభిమానులకి తీవ్ర నిరాశ ఎదురయ్యింది. నిజానికి ఇది అవమానం గా భావిస్తున్న వాళ్ళూ ఉన్నారు. ఇన్నాళ్ళు అభిమానులంటే తన సొంత తమ్ముళ్ళూ.., వారి తరవాతే ఏదైనా అంటూ వచ్చిన చిరంజీవి ఇలా కనీసం ఈవెంట్ కి కూడా రాక పోవటం జీర్ణించుకోలేకపోతున్నారు.

చిరంజీవి పుట్టినరోజు సంబరాలు

మామూలుగా అయితే పనుల వల్ల కుదరలేదేమో అనుకునే వాళ్ళే గానీ... స్టార్ హొతల్లో సెలబ్రిటీల కోసం ఇచ్చిన పార్టీకి మాత్రం ఆయన హాజరవ్వటం మరింత భాద పెడుతోంది... ఇంతకీ ఏం జరిగింది.... "అన్నయ్య" గా పిలుచుకునే తమ అభిమాన హీరో ప్రవర్తనకి అభిమానుల భాద ఎలా ఉందీ అంటే....

చాలా ఆశలతో వచ్చారు

చాలా ఆశలతో వచ్చారు

చిరంజీవి కేక్‌ కట్ చేస్తాడు.. సినిమా ఫస్ట్‌ లుక్‌ అక్కడే విడుదలవుతుంది.. పవన్‌కళ్యాణ్‌ కూడా వస్తాడట.. ఇలా అభిమానులు చాలా చాలా ఆశలతోనే ఈవెంట్ కి వచ్చారు.

అక్కడేమీ లేదు

అక్కడేమీ లేదు

తీరా ఈవెంట్‌కి వెళితే అక్కడేమీ లేదు. షరామామూలు సినిమా ఫంక్షన్లలో కన్పించే సందడే అక్కడా కనిపించింది. పాటలు పాడారు, డాన్సులేసేశారు.. ఇంకా ఏదేదో హడావిడి చేశారు. చివరికి తుస్సుమనిపించారు.

హంగామా ఏమీ కన్పించలేదు

హంగామా ఏమీ కన్పించలేదు

అసలు చిరంజీవి పుట్టినరోజు ఫంక్షన్... అందులోనూ ఎనిమిదేళ్ళ తర్వాత హీరో గా వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కూడా ఉంటుందీ అంటే ఎలా జరగాలి.? ఆ స్థాయిలో హంగామా ఏమీ కన్పించలేదు.

పెద్దగా సీన్‌ లేదు

పెద్దగా సీన్‌ లేదు

చరణ్‌, అల్లు అర్జున్‌, ఇంకొందరు మెగా హీరోలు, వీరికి తోడు దర్శకులు వినాయక్‌, సురేందర్‌రెడ్డి, ఒకరిద్దరు ప్రముఖులు.. ఇంతకు మించి ఇక్కడ పెద్దగా సీన్‌ లేదు.

అంతా తూ..తూ...మంత్రం

అంతా తూ..తూ...మంత్రం

పైగా, వేదిక మీద ఏమన్నా గొప్పగా అభిమానుల్ని ఉర్రూతలూగించిన ప్రసంగాలున్నాయా.? అంటే అదీ లేదు. అంతా తూ..తూ...మంత్రం గా ఏదో అయ్యిందీ అనిపించారు.

ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో

ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో

ఆఖరికిసినిమా ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో రిలీజ్‌ అయ్యింది. అదేదో పుట్టినరోజు వేడుకల్లో లాంఛ్‌ చేసినా బాగుండేది.

చిరంజీవి డుమ్మా కొట్టడం

చిరంజీవి డుమ్మా కొట్టడం

సరే అవన్ని పరవాలేదుకానీ అసలు ఉత్సాహం చిరంజీవి ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడంతో అభిమానులు ఆగ్రహావేశాలతో రగలిపోతున్నారు. పిలిచి అవమానించడమంటే ఇదేనని అభిమానులు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోసేస్తున్నారు.

భిన్నంగా జరిగింది

భిన్నంగా జరిగింది

మామూలుగా అయితే ముందు రోజు రాత్రికి ఈవెంట్‌ నిర్వహిస్తుంటారు.ఈసారి అందుకు భిన్నంగా జరిగింది.

స్టార్‌ హోటల్లో పార్టీ కి మాత్రం హాజరయ్యారు

స్టార్‌ హోటల్లో పార్టీ కి మాత్రం హాజరయ్యారు

ఇదే ఒక మైనస్ అంటే ఇంకోపక్క ప్రముఖుల కోసం ఓ స్టార్‌ హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీకి మాత్రం చిరంజీవి హాజరయ్యారు. అది అభిమానులకి 'పుండు మీద కారం చల్లినట్లు'గా తయారయ్యింది.

సురేందర్‌రెడ్డి

సురేందర్‌రెడ్డి

ఆఖరికి, దర్శకుడు సురేందర్‌రెడ్డికి మైక్‌ ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నంత పన్జేశారు. 'ధృవ' సినిమా గురించీ, చిరంజీవి గురించీ మాట్లాడదామనుకున్న సురేందర్‌రెడ్డి, వెనకాల కేక్‌ కటింగ్‌ హడావిడి మొదలవడంతో సగంలోనే తన స్పీచ్‌ని ఆపేయాల్సి వచ్చింది.

చరణ్‌రిక్వెస్ట్‌ చేశాడు

చరణ్‌రిక్వెస్ట్‌ చేశాడు

మాట్లాడమని సురేందర్‌రెడ్డిని వేదిక మీదకు పిలిపించి, అవమానించారన్న టాక్ కూడా మొదలయ్యింది. 'మీరు మాట్లాడండి..' అంటూ చరణ్‌, సురేందర్‌రెడ్డిని రిక్వెస్ట్‌ చేశాడుగానీ, ఓవరాల్‌గా ఈవెంట్‌ని సరిగ్గా మేనేజ్‌ చేయలేకపోయారు.

English summary
Mega fans upset for Megastar Chiru not attend to his 61st Birthday Celebration event
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu