twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరుకి గానీ ఆయన ఫ్యామిలీకి గానీ వాటితో ఎలాంటి సంబంధం లేదు.. క్లారిటీ ఇస్తూ ప్రెస్ నోట్

    |

    ఇన్నాళ్లు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి పలు సామాజిక సేవా సంస్థలు నడిపిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విద్యా వ్యవస్థ లోకి అడుగు పెడుతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఓ పాఠశాలను ఆయన ప్రారంభించబోతున్నట్లు వార్తలు రాసుకొచ్చారు. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు మెగా అభిమానులు.

    చిరంజీవి ఫ్యామిలీకి సంబంధం లేదు

    చిరంజీవికి గానీ, రామ్ చరణ్ కి గానీ, నాగబాబుకి గానీ ఈ విద్యాసంస్థలతో ఎటువంటి సంబంధం లేదని ఈ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. చిరంజీవి అభిమానులమైన తాము సేవా దృక్పధంతో, సామాజిక స్పృహతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరిట విద్యాసంస్థను స్థాపిస్తున్నామని తెలిపారు.

    దిగువ తరగతి ప్రజలకు మేలు కలగాలని

    దిగువ తరగతి ప్రజలకు మేలు కలగాలని

    కార్పొరేట్ కల్చర్ బాగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో దిగువ, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ విద్య అనేది అందని ద్రాక్ష అయింది. బోలెడు ఫీజులు చెల్లించి కార్పొరేట్ విద్య అందించలేక ఎంతో మంది తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. ఈ వెలితిని తీర్చేందుకే మా చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబోతున్నామని వారు అన్నారు.

    తక్కువ ఫీజులు.. మెగా కుటుంబంపై అభిమానంతో

    తక్కువ ఫీజులు.. మెగా కుటుంబంపై అభిమానంతో

    తమకు మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే ఈ విద్యాసంస్థను ప్రారంభిస్తున్నామని, దీనికి చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని, నాగబాబు గారిని గౌరవ ఫౌండర్లుగా, గౌరవ అధ్యక్షులుగా మియమించుకున్నామని పేర్కొంటూ.. ఈ విద్యాసంస్థ ద్వారా దిగువ, మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులకే విద్యనందిస్తామని తెలిపారు. తమ యొక్క ఈ చిరు ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలని ఈ సందర్బంగా వారు అభ్యర్థించారు.

    మెగాస్టార్ చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి

    చిత్రసీమలోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాలో నటిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని అక్టోబర్ 2 తేదీన విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

    English summary
    Mega fans giving the clarity on Chiranjeevi International Schools. Released press note. They said chiranjeeevi, Ram Charan and Nagababu are respectable founders of this school
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X