»   »  కంచె హీరోయిన్‌కి మెగా ఫ్యాన్స్ వార్నింగ్

కంచె హీరోయిన్‌కి మెగా ఫ్యాన్స్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసర కానుకగా అక్టోబర్ 22న విడుదైలంది. సినిమా ప్రమోషన్లో భాగంగా... షూటింగ్ సమయంలోని తన అనుభవాలను చెప్పుకొచ్చింది ప్రగ్యా జైస్వాల్.

Varun Tej

వరణ్ తేజ్.... తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బిగ్ ఫ్యామిలీ నుండి వచ్చడనే విషయం తెలుసుకానీ, చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అయిన ఆమెకు తెలియదట. తర్వాత విషయం తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయిందట. వరుణ్ ఎంతో సింపుల్ గా, అందరితో కలుపుగోలుగా ఉంటాడని తెలిపింది.

ఓసారి గోదావరి జిల్లాలోని తాటిపాక అనే విలేజ్ లో షూటింగ్ జరుగుతుండగా.... అభిమానులు భారీగా అక్కడికి వచ్చారు. నేను వరుణ్ తేజ్ ను చెంప చెల్లుమనిపించే సన్నివేశం. అక్కడున్న అభిమానులంతా తెలుగులో కొట్టొద్దు అంటూ అరవడం మొదలు పెట్టారు. వారు తెలుగులో అరవడంతో తొలుత నాకు అర్థం కాలేదు. వారుణ్ తేజ్ విషయం నాకు అర్థమయ్యేట్లు చెప్పాక ఆ సీన్ చేయడానికి బయ మేసింది' అని తెలిపింది.

వరుణ్ ను చెంప చెల్లు మనిపించే సీన్ చేస్తుంటే ... మెగా అభిమానులంతా నాకు వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది అని ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది.

English summary
Pragya Jaiswal, who plays the female lead in Varun Tej's Kanche, directed by Krish, says the experience of working in the film transported her to a different era.
Please Wait while comments are loading...