»   »  గోవాలో మెగా హీరోలతో దిల్ రాజు (ఫొటో)

గోవాలో మెగా హీరోలతో దిల్ రాజు (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగా హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్ లతో పాటు రానా, రవితేజ, నిర్మాత దిల్‌రాజు తదితరులు గత ఏడాది గోవాలో జరిగిన ‘సన్‌బర్న్‌ ఫెస్టివల్‌-2015'లో హల్ చల్ చేశారు. ఆ ఫెస్టివల్‌లో దిగిన ఓ ఫొటోను దిల్‌రాజు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. గోవాలో నిర్వహించిన ‘సన్‌బర్న్‌ ఫెస్టివల్‌-2015'లో అంటూ ఆ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడవచ్చు.

At Goa Sunburn Festival :)

Posted by Dil Raju on 17 January 2016

మారుతున్న టెక్నాలజీకి తగినట్లుగా సన్‌బర్న్‌ ఫెస్టివల్ వెరైటీగా నిర్వహిస్తున్నారు. పబ్‌లకు వచ్చే యూత్ కోసం సన్‌బర్న్‌ ఫెస్టివల్‌ జరగుతోంది. సాధారణంగా నవంబర్‌ లో ముంబాయిలోని సన్‌బర్న్‌లో, బెంగుళూరులోని సన్‌బర్న్‌లో ఈ ఫెస్టివల్‌ జరగతోంది. గోవా, ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు నగరాల తరువాత హైదరాబాద్‌లో సన్‌బర్న్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. పార్టీప్రియులకు ఈఫెస్టివల్‌ సరికొత్త అనుభూతులను పంచుతుందని సన్‌బర్న్‌ బ్రాండ్‌ శైలేంద్రసింగ్‌ చెప్తున్నారు.

Mega Hero's At Goa Sunburn Festival

ఇక చిరంజీవి 150 వ చిత్రం విషయానికి మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్.

వివి వినాయక్ మాట్లాడుతూ...మార్చి లేదా ఏప్రిల్ లో సినిమా తొలి షెడ్యూల్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

English summary
Dil Raju Shared a photo of Goa Sunburn Festival-2015.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu