Just In
- 12 min ago
ఫైనల్ గా డ్రీమ్ ప్రాజెక్టును మొదలు పెట్టిన హీరో నిఖీల్!
- 17 min ago
వాటికి నువ్ అర్హుడివే.. ‘పొగరు’పై ప్రశాంత్ నీల్ కామెంట్స్
- 30 min ago
అయ్యో పాపం.. నితిన్ మీద ఎక్కబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్!
- 56 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
Don't Miss!
- News
భారత్‌లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
- Sports
పిచ్‌ను నిందించిన మాజీ క్రికెటర్లపై అశ్విన్ పరోక్ష వ్యాఖ్యలు!
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగా అభిమాని మృతి.. కదిలి వచ్చిన చిరంజీవి, అల్లు అర్జున్.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
మెగాభిమానులు అనేది ఓ కుటుంబంలాంటింది. మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా ప్రేమిస్తూ ఆదరిస్తూనే ఉంటారు మెగాభిమానులు. ఒకరా ఇద్దరా అని లెక్కపెట్టడానికి వీల్లేనటువంటి సమూహంలా ఉంటుంది ఆ గణం. అందులోంచి ఓ వీరాభిమాని నేడు మరణించాడు. అతనెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొన్ని సాయి ధరమ్ తేజ్ వరకు గొప్ప అభిమానిగా పేరు తెచ్చుకున్నాడు నూర్ భాయ్.

గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్..
గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశాడు. ఈ సంగతి తెలిసిన మెగా అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
అభిమానులే కుటుంబం..
‘ఫ్యాన్సే ఫ్యామిలీ. నూర్ మహ్మద్ గారిని మేమంతా మిస్ అవుతాము. అతని పాజిటివ్ అండ్ హెల్పింగ్ నేచర్ ఎంతో మంది స్ఫూర్తిధాయకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి'అంటూ రామ్ చరణ్ స్పందించాడు.
మెగాఫ్యామిలీ అతడ్ని కోల్పోయింది..
‘మెగాఫ్యాన్స్ అనే ఫ్యామిలీ.. స్ట్రాంగెస్ట్ పిల్లర్‌ను కోల్పోయింది. నూర్ భాయ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి, అతని కుటుంబానికి బలం చేకూరాలి, నా మద్దతు వారికి ఉంటుంది' అంటూ సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశాడు.
|
కుటుంబాన్ని ఓదార్చిన అల్లు అర్జున్..
నూర్ మరణ వార్తను తెలుసుకున్న అల్లు అర్జున్ సైతం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చాడు. కుటుంబాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుటుంబాన్ని పరామర్శించిన చిరంజీవి..
ఎన్నో యేళ్ల నుంచి మెగా ఫ్యామిలీకి అభిమానిగా, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న నూర్ మహ్మద్ నేడు మరణించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి.. అభిమాని ఇంటికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించాడు.