»   » మెగాస్టార్ పెళ్లి జరిగి 37 ఏండ్లు.. ఇదుగో వెడ్డింగ్ కార్డు.. శతమానం భవతి.

మెగాస్టార్ పెళ్లి జరిగి 37 ఏండ్లు.. ఇదుగో వెడ్డింగ్ కార్డు.. శతమానం భవతి.

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఫిబ్రవరి 20 మరిచిపోలేనటువంటి రోజు. ఈ రోజుకు మన మాస్టరి పెండ్లి జరిగి సరిగ్గా 37 ఏండ్లు. 1980 ఫిబ్రవరి 20న మద్రాస్‌లో ఉదయం 10.50 గంటలకు చిరంజీవి వివాహం ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. అదే రోజు 6 నుంచి 8 గంటల మధ్య రిసెప్షన్ కార్యక్రమం జరిగింది.

సురేఖ అడుగుపెట్టిన వేళా విశేషం..

సురేఖ అడుగుపెట్టిన వేళా విశేషం..

వైవాహిక జీవితంలో ఎన్నో మధుర స్మృతులు.. ఎన్నో విజయాలను చిరంజీవి అందుకొన్నారు. చిరంజీవి జీవితంలోకి సురేఖ అడుగుపెట్టిన వేళావిశేషమో ఏమో కాని ఆయన భారీ విజయాలను అందుకొన్నారు. అనతికాలంలోనే అశేష అభిమానులను సంపాదించుకొన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకొన్నారు. మెగాస్టార్‌గా అందరివాడిగా మారాడు.

ప్రజాసేవలో అందరివాడుగా మెగాస్టార్

ప్రజాసేవలో అందరివాడుగా మెగాస్టార్

కేవలం హీరోనే కాకుండా స్వచ్ఛంద కార్యక్రమాలను చిరంజీవి ప్రారంభించారు. రక్తదానం, నేత్రదానం కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు. కథా నాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా ప్రజాసేవకు నడుంకట్టారు.

పేదవారికి అండగా చిరంజీవి

పేదవారికి అండగా చిరంజీవి

10 ఏండ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తన స్టామినాను గుర్తు చేశారు. ఇటీవల మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా టెలివిజన్ హోస్ట్‌గా మారారు. మీలో ఎవరూ కోటీశ్వరుడులో పాల్గొన్న ఓ పేద ఆటోడ్రైవర్ సతీష్ కుటుంబాన్ని ఆర్థిక సహాయంతో ఆదుకోవడం పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. తండ్రి మరణంతో కుంగిపోయి.. సోదరి పెండ్లితో ఆర్థిక భారాన్ని మోస్తున్న సతీష్‌కు ఈ అందరివాడు అండగా నిలిచాడు. రూ.2 లక్షల రూపాయల సహాయాన్ని అందజేసి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.

సోషల్ మీడియాలో పెండ్లి పత్రిక

సోషల్ మీడియాలో పెండ్లి పత్రిక

అలాంటి ఎన్నో ఘనతలు సాధించిన మన మెగాస్టార్ పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు, సన్నిహితులు చిరంజీవి దంపతులకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. వంద ఏండ్లపాటు ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ ‘శతమానం భవతి' అని దీవిస్తున్నారు.

English summary
Mega star Chiranjeevi 37th Wedding anniversary, Invitation card viral in social media. Many of his fans wishing wonderful life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu