twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బరువెక్కిన గుండెతో బీఏ రాజుకు చిరంజీవి పరామర్శ

    By Bojja Kumar
    |

    గుండెపోటుతో మరణించిన దర్శకురాలు, ఫిల్మ్ జర్నలిస్ట్ బీఏ జయ కుటుంబాన్ని చిరంజీవి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జయ భర్త, పీఆర్ఓ బీఏ రాజును కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ... మిత్రురాలు, సోదర సమానురాలు బీఏ జయగారు మన మధ్య లేరు అనేది జీర్ణించుకోలేని విషయం. ఆమె మరణించిన ఈ విషయం తెలిసి అవాక్కయ్యాను. నమ్మశక్యం కాలేదు. ఇది నిజమా? కాదా? ఫోన్ చేసి కనుక్కుంటే ఈ విషాదం గురించి తెలిసింది. ఇది చాలా దురదృష్టకరం.... అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

    బీఏ రాజు నాకు చిరకాల మిత్రుడు. చెన్నైలో ఉన్నప్పటి నుండి వీరిద్దరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జయగారు ఒక రైటర్ గానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఫీల్డులో కూడా నిష్ణాతురాలు. రచయితగా, విలేఖరిగా, దర్శకురాలిగా అన్ని శాఖలపై ఆమెకు పట్టుంది. అలాంటి వ్యక్తి లేక పోవడం పరిశ్రమకు తీరని లోటు అన్నారు.

    Mega Star Chiranjeevi About BA Jaya

    మహిళా దర్శకురాలిగా ఎంతో పేరుగడించిన వ్యక్తి మనల్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం. బీఏ రాజు నాతో మాట్లాడుతూ... 'చనిపోయింది తను కాదండీ... నేను. నా ఆలోచనలో, ఊహల్లో జయ బ్రతికే ఉంది. తను లేని నేను లేనట్లే' అని అయన చెప్పడం బాలా బాధనిపించిందని చిరంజీవి అన్నారు.

    Mega Star Chiranjeevi About BA Jaya

    ఏది ఏమైనా జరుగాల్సిన కర్మ జరుగక మానదు. సోదరి జయ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. బీఏ రాజుకు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని చిరంజీవి అన్నారు.

    English summary
    Chiranjeevi visited BA Raju's residence to offer condolences to his bereaved family on Friday. Film journalist and PRO BA Raju's wife B Jaya died of cardiac arrest at a private hospital late on Thursday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X