నారప్పలో మెగాస్టార్ రిఫరెన్స్.. ఆ కుర్రోడు పెద్దోదయ్యాడుగా.. తోపు కాబట్టే మరి!
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా సినిమా నారప్ప. తమిళంలో సూపర్ హిట్ అయినా అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించారు. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ డిఫరెంట్ గెటప్ లో కనిపించగా, చిరంజీవి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

నారప్ప ట్రెండ్
విక్టరీ వెంకటేష్ నారప్ప చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ఓ సీన్ మాత్రం మెగా అభిమానులను సర్ ప్రైజ్ చేసేస్తోంది. ఆ సీన్ చూసి చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వరుస ట్వీట్స్ తో మెగా అభిమానులు నారప్పను ట్రెండ్ చేస్తున్నారు.
Narappa మూవీ రివ్యూ: వెంకటేష్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే!

చూస్తా ఉండు ఆ కుర్రోడు
సినిమాలో విలన్ థియేటర్ లో సినిమా చూసే సీన్ అది. అందులో థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి సంఘర్షణ సినిమా ప్రదర్శితమవుతుంది. చిరంజీవి నటించిన సంఘర్షణ సినిమా నుంచి కట్టు జారి పోతా ఉంది అనే సాంగ్ ఈ సీన్ లో వస్తుంది. అప్పుడు విలన్ చెప్పిన డైలాగ్ కు మెగాస్టార్ ఫాన్స్ విజిల్స్ వేస్తున్నారు. ''చూస్తా ఉండు ఆ కుర్రోడు ఓ రోజు పెద్దోడు అవుతాడు'' అంటూ విలన్ చిరంజీవిని ఉద్దేశించి పొగుడుతాడు.

జోరు చూస్తుంటే
ఇక ఇక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుందనే చెప్పాలి. ఇక సినిమాలో ఎవరూ ఊహించని విధంగా మెగాస్టార్ సినిమాకు సంబంధించిన సీన్ ను రిఫరెన్స్ గా నారప్పలో వాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మేకర్స్. నెట్టింట్లో మెగా అభిమానుల జోరు చూస్తుంటే నారప్ప మేకర్స్ అనుకున్నదాని కన్నా రేంజ్ లో హిట్ అయ్యేలా కనిపిస్తోంది.
Narappa twitter review: ఆ ఒక్క విషయంలో అప్సెట్ అవుతున్న ఫ్యాన్స్.. హైలెట్ క్యారెక్టర్ అదే!

చిరంజీవి తోపు కాబట్టే
మరి కొంత మంది మెగా అభిమానులు చిరంజీవి తోపు కాబట్టే వెంకటేష్ సినిమాలో ఆ సీన్ వాడుకున్నారని అంటున్నారు. ఎలాగైతేనేమి మొత్తానికి ఈరోజు నారప్ప టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది.

పోలిక
తమిళ చిత్రం అసురన్ కు రీమేక్ గా నారప్ప విషయం తెలిసిందే. తమిళ చిత్రంలో ధనుష్ నటన నేషనల్ అవార్డు లెవెల్లో కనిపించింది. మరి నారప్ప గా వెంకటేష్ నటన ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది రీమేక్ చిత్రం కాబట్టి కచ్చితంగా నెటిజన్లు ధనుష్ తో వెంకటేష్ నటనను పోల్చుతారు.


Click it and Unblock the Notifications











