twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా వల్లే ఆ మూవీ ప్లాప్, రాజమౌళి మూవీ తర్వాత చెర్రీ అతడితోనే: చిరంజీవి

    By Bojja Kumar
    |

    సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరణ్ హీరో హీరోయిన్లుగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తేజ్.. ఐ లవ్ యు'. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ఈ మూవీకి గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు. సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో వేడుక నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    Recommended Video

    Megastar Chiranjeevi As Chief Guest For Tej I Love You Audio Launch
    అభిమానుల కేరింతలతో మురిసిన మెగాస్టార్

    అభిమానుల కేరింతలతో మురిసిన మెగాస్టార్

    మెగాస్టార్ చిరంజీవి స్టేజీపైకి రాగానే ఆడిటోరియం కేరింతలు, విజిల్స్‌తో మార్మోగి పోయింది. దీనిపై చిరంజీవి స్పందిస్తూ... మీ ఈలలు, చప్పట్లు, కేరింతలు ఎప్పుడు విన్నా సరే ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంది. ఎడారిలో దాహంతో ఉన్నవారికి గ్లాసుడు చల్లటి మంచి నీరు ఇస్తే ఎంత ఆనందం వేస్తుందో ఈ కేరింతలు, చప్పట్లు విన్నపుడల్లా ఇంపుగా సొంపుగా అనిపిస్తాయంటూ అభిమానులను మిరింత ఉత్సాహ పరిచారు మెగాస్టార్

    తేజ్ కోసం రాలేదు

    తేజ్ కోసం రాలేదు


    ఈ ఫంక్షన్‌కు రావడానికి కారణం నా మేనల్లుడు తేజ్ అని కానే కాదు, నా ప్రియతమ మిత్రుడు కె.ఎస్‌.రామారావుగారి కోసమే, ఆయన తర్వాతే తేజ్ అయినా ఇంకెవరైనా అని చిరంజీవి వ్యాఖ్యానించారు. 80వ ద‌శ‌కంలో చిరంజీవికి ఎక్కువ శాతం సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాలు ఉన్నాయ‌న్నా, చిరంజీవి న‌వ‌లా క‌థ‌నాయ‌కుడు అనే పేరు తెచ్చుకున్నా, చిరంజీవికి ఎవ‌రికీ లేన‌న్ని సూప‌ర్‌హిట్ సాంగ్స్‌, ముఖ్యంగా ఇళ‌య‌రాజాగారి నుండి వ‌చ్చాయ‌న్నా, అప్ప‌టి దాకా సుప్రీమ్ హీరో అని అభిమానులు అభిమానంతో బిరుదులు ఇచ్చినా, మెగాస్టార్ అని ఈరోజు ఆప్యాయంగా, ముద్దుగా పిలుస్తున్న పేరు ఎవ‌రిచ్చారు అని చూసుకుంటే.. అన్నింటికి దొరికే స‌మాధాన‌మే కెఎస్ రామారావుగారి క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌. ఆ బ్యాన‌ర్‌తో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది.... అని మెగాస్టార్ తెలిపారు.

    కెఎస్ రామారావు గురించి

    కెఎస్ రామారావు గురించి


    1982లో అభిలాష‌, చాలెంజ్‌, రాక్ష‌సుడు, మ‌ర‌ణ‌మృదంగం లాంటి వ‌రుస హిట్స్ రావడానికి కె.ఎస్‌.రామారావుగారు. అభిలాష స‌మ‌యంలో ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఏర్పడింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో నేను చెప్ప‌న‌క్క‌ర్లేదు. 80 ద‌శ‌కంలో నాకు అన్ని హిట్స్ వ‌చ్చి ఎక్కువ మంది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందానంటే అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ కె.ఎస్‌.రామారావుగారే. నా కెరీర్‌లో ఆయ‌న కంట్రిబ్యూష‌న్‌ను నేను మ‌ర‌చిపోలేను. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు థాంక్యూ. ఆ బ్యాన‌ర్‌లో క‌మ‌ర్షియ‌ల్ అనే పేరున్నా కూడా ఆయ‌న డ‌బ్బులు కోసం ఎప్పుడూ సినిమాలు తీయ‌లేదు. అత్య‌ద్భుత‌మైన సినిమాలు తీయాలి, వాటి ద్వారా నేను నిరంతరం బ్ర‌తికి ఉండాలి అని ఆలోచిస్తుంటారు. నిర్మాత‌లు వ‌స్తుంటారు.. పోతుంటారు. కానీ కె.ఎస్‌.రామారావుగారు స్థిరంగా నిల‌బడ్డారంటే కారణం ఆయ‌న అభిరుచి, అభిలాషే కార‌ణం.

    ఆ సినిమా ప్లాపవ్వడానికి కారణం నేనే

    ఆ సినిమా ప్లాపవ్వడానికి కారణం నేనే

    చెన్నై నుండి ఇండ‌స్ట్రీ హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయిన‌ప్పుడు ముందుగా వ‌చ్చింది ఆయ‌నే. మేమందరం ఆలోచించినా కూడా రామారావుగారికి ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అభివృద్ధి చెందాల‌నే కోరిక బ‌లంగా ఉండేది. నా కార‌ణంగానే ఆ బ్యాన‌ర్‌లో స్టూవ‌ర్టుపురం పోలీస్ స్టేష‌న్ అనే ఫెయిల్యూర్ స్టోరీ ఇచ్చాను. అది కూడా నా త‌ప్పిద‌మే. క‌థ ఆయ‌న‌కు న‌చ్చింది. డైరెక్ట‌ర్‌గా యండ‌మూరి వీరేంద్ర‌నాథ్‌ను పెట్టాల‌నుకున్నాం. అయితే అప్ప‌టికే ఆయ‌న చేసిన అగ్నిప్ర‌వేశం పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. మ‌రో డైరెక్ట‌ర్‌ని పెడ‌దామా? అని రామారావుగారు అన్నా కూడా నేను వ‌ద్ద‌నే అన్నాను. త‌ర్వాత సినిమా చేశాం. ఆ సినిమా ఫెయిల్ కావ‌డానికి నేనే కార‌ణం అని అప్ప‌ట్లో ఆయ‌న పెద్ద మ‌న‌సుతో ఒప్పుకున్నారు. ఎవ‌రి త‌ప్పు కాదు కానీ.. ఎక్క‌డో మిస్ ఫైర్ అయ్యింది. ఆరోజు రామారావుగారి అభిరుచి మేర డైరెక్ట‌ర్‌ని మార్చుంటే, రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేదేమో. నేను ప‌ట్టు బ‌ట్ట‌డంతో నాకు ఇప్ప‌టికీ గిల్టీఫీలింగ్ ఉంది... అని చిరంజీవి అన్నారు.

    రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తానన్నాడు

    రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తానన్నాడు

    మెగాఫ్యామిలీతో సినిమా చేయాల‌నుంద‌ని కోరిక వెలిబుచ్చారు. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌తో సినిమా చేయ‌డం ద్వారా కాస్త సంతృప్తి చెందాన‌ని ఆయ‌న నాకు చెప్ప‌డం జ‌రిగింది. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ నాతో మాట్లాడుతూ.. నాన్న నేను కె.ఎస్‌.రామారావుగారితో సినిమా చేయాల‌నుంది. త‌ప్ప‌కుండా ఓ సినిమా చేస్తాను అన్నాడు. ఎందుకు అని అడిగితే మీకు, ఆయ‌న‌కు నేను పుట్ట‌క ముందు నుండే అనుబంధం ఉంది. ఆయ‌న అభిరుచి, టెస్ట్‌ఫుల్ నిర్మాత అని తెలుసు. రాజ‌మౌళిగారి త‌ర్వాత సినిమా చేయాల్సి వ‌స్తే.. కె.ఎస్‌.రామారావుగారి సినిమానే చేస్తాను అని అన్నాడు. ఏ డైరెక్ట‌ర్ అయిన పరావాలేదు అని అన్నాడు. నేను, చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర మాట కూడా క‌న్‌ఫ‌ర్మ్ చేసుకున్నాను. ఈ యువ త‌రం హీరోలు కూడా కె.ఎస్‌.రామారావుగారితో సినిమా చేయాల‌నుకుంటున్నారంటే నేను ఆయ‌నేంటో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌టీజ్ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్‌.... అని మెస్టార్ చెప్పుకొచ్చారు.

    తేజ్ ఐ లవ్ యూ....పై నమ్మకం ఉంది

    తేజ్ ఐ లవ్ యూ....పై నమ్మకం ఉంది

    ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని, ఈ సినిమాతో వైభ‌వాన్ని తెచ్చుకుంటార‌ని భావిస్తున్నాను. గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. అందుకు ప్ర‌ధాన కారణం, క‌రుణాక‌ర‌న్‌. ఎందుకంటే .. ల‌వ్‌స్టోరీస్ చేయడంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌న డైరెక్ట్ చేసిన తొలిప్రేమ సినిమా నాకు ఎంతో ఇష్ట‌మైన‌ది. మా ప‌వ‌న్ యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఇప్ప‌టికీ ప్ర‌తి సీన్ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు అనిపిస్తుంటుంది. అంటే డైరెక్ట‌ర్‌గా క‌రుణాక‌ర‌ణ్ ఎంత ఇంపాక్ట్ చూపించారో అర్థం చేసుకోవాలి. అలాగే బ‌న్నితో హ్యాపీ సినిమా చేశారు. ఆయ‌న కూడా గ్యాప్ తీసుకున్నారు. యంగ్ డైరెక్ట‌ర్స్ గ్యాప్ తీసుకోకూడ‌దు. ఈ సినిమాతో క‌రుణాక‌ర‌ణ్ తొలిప్రేమ అంత‌టి హిట్ కొట్టాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... అని చిరంజీవి అన్నారు.

    మేనల్లుడు తేజ్ గురించి

    మేనల్లుడు తేజ్ గురించి


    మా తేజు గురించి చెప్పాలంటే.. నా నుండి వీళ్లంద‌రికీ ఇమేజ్ మాత్ర‌మే కాదు.. క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వం సంక్ర‌మించింది. డాన్సులు, ఫైట్స్ చేయ‌డం కాదు.. ఒళ్లు వంచి, ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ప‌నిచేస్తున్నామా లేదా? అంద‌రితో అనుబంధంలో ఉన్నామా? లేదా? అనేదే నాకు ప్ర‌ధానం. మా ఫ్యామిలీ అంద‌రూ హీరోలు చ‌క్క‌గా నడుచుకుంటున్నారు. ఆ ర‌కంగా తేజు.. నా గుడ్ బుక్స్‌లో ఎప్పుడూ ముందుంటాడు. ఈ సినిమా ర‌షెష్ చూశాను. చాలా చాలా క‌న్నుల పండుగ‌గా సినిమా ఉంది. క‌చ్చితంగా అల‌రించే ఫ్యామిలీ ల‌వ్‌స్టోరీ ఇది. గోపీసుంద‌ర్‌.. చ‌క్క‌టి మ్యూజిక్ ఇచ్చారు. పాట‌ల‌ను బాగా ఎంజాయ్ చేశాను. అమ‌ప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గ్లామ‌ర్‌గా క‌న‌ప‌డింది. చ‌క్క‌టి పెర్ఫామ‌న్స్ ఇచ్చింది. త‌న‌కు కూడా అభినంద‌న‌లు. అండ్రూ సినిమాటోగ్ర‌పీ చాలా బావుంది. సాహి సురేశ్ ఆర్ట్ ప‌నిత‌నం, ఎడిట‌ర్ శేఖ‌ర్‌, డైలాగ్ రైట‌ర్ డార్లింగ్ స్వామి స‌హా ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు.. అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

    English summary
    Mega Star Chiranjeevi Full Speech at Tej I Love You Audio Launch. The movie Starring Sai DharamTej, Anupama Parameswaran. Music By Gopi Sundar, Directed By A.Karunakaran, Produced By KS Rama Rao Under The Banner of Creative Commercials Movie Makers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X