»   » రామ్ చరణ్‌ ఇచ్చిన కారు... వేలం వేస్తున్న చిరు...!?

రామ్ చరణ్‌ ఇచ్చిన కారు... వేలం వేస్తున్న చిరు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్న (22.08.2010) మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా రామ్‌ చరణ్‌ మెగా అభిమానుల మధ్య బ్లెడ్‌ బ్యాంక్‌లో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా చరణ్‌ మాట్లాడుతూ...'నాన్నగారు నటించే 150వ చిత్రానికి నేనే నిర్మాతను. మా కాంబినేషన్‌ లో వస్తున్న ఈ చిత్రం పూర్తి వివరాలు అతి త్వరలో తెలుపుతాను". అలా చరణ్ అన్నారో లేదో అప్పుడే చిరంజీవి నటించబోయే 150వ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని, ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించాలని చరణ్ అనుకుంటున్నాడట. దాదాపు 50కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మిచనున్నారని సమాచారం. చిరంజీవి రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలనే ఆకాంక్షతోనే ఇలా భారీ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారని సమాచారం.

ఇక తన తండ్రికి బర్త్‌ డే కానుకగా రామ్‌ చరణ్‌ 'రోల్స్‌ రాయ్‌ ఫాంఠమ్‌" అనే కారును గిఫ్ట్‌ గా ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి తన తనయుడు ఇచ్చిన కారును లైన్‌ లో పెట్టి.. తన దగ్గర వున్న కారును వేలం వేసి ఆ వచ్చిన డబ్బులతో పేద కాళాకారులకు, విద్యార్దులకు తన వంతు సహాయం చేయాలనే ఆలోచనలో వున్నట్లు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu