twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి పునాదిరాళ్ళు (బర్తడే స్పెషల్)

    By Staff
    |

    Chiranjeevi
    మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత జరుపుకోనున్న తొలి పుట్టిన రోజు సందర్భంగా...ఆయన తొలి అడుగులు కొన్ని (ఆందిన సమాచారం ప్రకారం)

    భూమిపై పడ్డ క్షణం: 1955వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీ నర్సాపురం మిషన్ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల ఐదు నిముషాలకు

    చిరంజీవి రిలీజైన తొలి చిత్రం: ప్రాణం ఖరీదు (కె.వాసు దర్శకత్వం) క్రాంతి కుమార్ నిర్మాత,చక్రమవర్తి సంగీతం,లోక్ నాధ్ ఫొటోగ్రఫి (విడుదల తేదీ 22-9-1978)
    మొదటి హీరోయిన్ :రేష్మారాయ్
    ప్రారంభమయిన మొదట చిత్రం: పునాదిరాళ్ళు (గూడపాటి రాజ్ కుమార్ దర్శకత్వం)
    చిరంజీవి క్లాప్ కొట్టిన తొలి చిత్రం: లవ్ ఇన్ సింగపూర్
    చిరంజీవి షీల్డులు పంపణీ చేసిన తొలి చిత్రం : మనిషికో చరిత్ర
    మొదటి పౌరాణిక పాత్ర :చట్టంతో పోరాటం -యమధర్మరాజు
    చిరంజీవి కెరీర్ లో తొలి స్కోప్ చిత్రం:రాక్షసుడు
    తొలి నేపధ్య గాయకుడు జి.ఆనంద్ :(ప్రాణం ఖరీదు)
    చిరంజీవి తొలి ఇంటర్వూ ప్రచురించిన సినిమా పత్రిక: జ్యోతిచిత్ర (జర్నలిస్టు,రచయిత అయిన ఎం.కోటేశ్వరరావు చిరంజీవిని ఇంటర్వూ చేసారు)
    చిరంజీవి గురించి తొలి పరిచయ శీర్షిక: "తెలుగు తెరకు క్రాంతికుమార్ పరిచయం చేస్తున్న కాంతి కిరణం చిరంజీవి"-జ్యోతి చిత్ర 1978 సంవత్సరం జులై 21

    చిరంజీవి నటించగా విడుదలైన తొలి చిత్రం: ప్రాణం ఖరీదు
    చిరంజీవి గాయకుడుగా గొంతు విప్పిన తొలి సినిమా :మాస్టర్ (తమ్ముడు..అరె తమ్ముడు)
    తొలి దండ,తొలి పారితోషికం,తొలి షీల్డు ఈ మూడూ అందుకున్నది :మనవూరి పాండవులు సినిమా కోసం-పారితోషికం 1116 రూపాయలు...అలాగే శతదినోత్సవ వేడుకల్లో మనవూరి పాండవులు నిర్మాతల్లో ఒకరైన జయకృష్ణ దండ వేస్తే,మరో నిర్మాత,హీరో అయిన కృష్ణం రాజు షీల్డ్ ని అందించారు.

    తమిళనాడులో విడుదలైన చిరంజీవి తొలి సినిమా :ఆరని మంటలు (తమిళ డభ్బింగ్ నిర్మాత ఎడిటర్ మోహన్)

    ఉత్తమ నటుడు అవార్డు(ఫిలిం ఫేర్ ఫిలిం ఫ్యాన్స్ )అందుకున్నది :పున్నమి నాగు చిత్రం కోసం 1980 లో
    తొలి బిరుదు :నటకిషోర్ 1981 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య గారిచే నటకిషోర్ వంశీ ఆర్ట్స్ వారు అందించారు.
    చిరంజీవి ఛారటబుల్ ట్రస్ట్ అంకురార్పణ :1983లో
    చిరంజీవి కోసం ప్రత్యేక పత్రిక: 1989వ సంవత్సరంలో ఆగస్టు 22 జన్మదినం రోజున అల్లు అరవింద్ ప్రచురణ కర్తగా ,విజయబాపినీడు సంపాదుకులుగా చిరంజీవి మాసపత్రిక వెలువడింది.

    చిరంజీవి రాజకీయ రంగ తొలి ప్రకటం ఆగస్టు 17-2008

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X