»   » విశ్వనాథ్‌కు ఫాల్కే ఇవ్వడంతో ఆ అవార్డుకు నిండుదనం.. మెగాస్టార్ చిరంజీవి

విశ్వనాథ్‌కు ఫాల్కే ఇవ్వడంతో ఆ అవార్డుకు నిండుదనం.. మెగాస్టార్ చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కళాతపస్వి కే విశ్వనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంపై పలువురు సినీ ప్రమఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశ్వనాథ్‌కు మెగాస్టార్ చిరంజీవి శుభాభివందనాలు తెలిపారు. చిరంజీవి నటించిన స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చిరంజీవికి స్వయంకృషి పలు అవార్డులను తెచ్చిపెట్టింది. అలాంటి దర్శకుడు విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డు రావడంతో తన సంతోషాన్ని మీడియాతో పంచుకొన్నారు.

ఆత్మీయ అనుబంధం..

ఆత్మీయ అనుబంధం..

ఈ సందర్భంగా మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ.. విశ్వ‌నాథ్ గారితో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. మా మధ్య అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని కాకుండా కుటంబ ప‌రంగాను మంచి రిలేషన్ ఉంది. ఆయ‌న‌కు ఈ అవార్డు రావ‌డం చాలా గ‌ర్వంగా ఉంది. మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతికి లోన‌వుతున్నాను అని అన్నారు.

ఆ విషయం ప్రస్తుతం అనవసరం.

ఆ విషయం ప్రస్తుతం అనవసరం.

అవార్డు రావడంలో ఆలస్యం అయిందా లేదా అనే విషయాలు ప్రస్తుతం అప్రస్తుతం. అవార్డు రావాల్సిన స‌మ‌యంలో వ‌చ్చిందా? లేదా అన్న దానిపై ఇప్పుడు మాట‌లు అన‌వ‌స‌రం. ఈ అవార్డు ఆయన్ను ఎప్పుడో వ‌రించాల్సింది. కానీ కాస్త ఆల‌స్య‌మైన అవార్డు ఆయ‌న్ను వ‌రించ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న ఎలా ఫీల్ అవుతున్నారో తెలియ‌దు గానీ, మేము మాత్రం చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

నిండుదనం వచ్చింది..

నిండుదనం వచ్చింది..

విశ్వనాథ్‌ గారికి ఫాల్కే రావ‌డంతో ఆ అవార్డుకు నిండుద‌నం వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌నలు తెలుపుతున్నా. ఎప్ప‌టికీ ఆయ‌న ఆశీస్సులు కోరే మ‌నిషినే..ఆయ‌న చిరంజీవినే` అని చిరంజీవి ఉద్వేగానికి గురయ్యారు.

మే 3 తేదీన ప్రదానం..

మే 3 తేదీన ప్రదానం..

2016 సంవత్సరానికి గాను ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును మే 3 తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి అందజేస్తారు. అవార్డు కింద రూ.10 లక్షలు, స్వర్ణపతకం, శాలువాతో సత్కరిస్తారు.

English summary
Megastar Chiranjeevi congratulated Director K Vishwanath for getting prestigious Dada Saheb Phalke award. He shares his views, memories with legendary director. Chiranjeevi acted Swayamkrushi, Apadbandavudu which directed by K Vishwanath.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu