Laal Singh Chaddha: ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన చిరంజీవి.. కన్నీళ్ళు పెట్టుకున్న అమీర్ ఖాన్!
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు. తన భార్యతో విడాకులు ప్రకటించిన తర్వాత ఆయన ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే అవుతున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి విచ్చేసిన అమీర్ ఖాన్ తాను హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా రివ్యూ వేసి చూపించారు. మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు డైరెక్టర్ సుకుమార్, రాజమౌళి అలాగే ఈ సినిమాలో భాగమైన నాగచైతన్య ఆయన తండ్రి నాగార్జునతో కలిసి ఒక స్పెషల్ ప్రివ్యూ చూశారు. ఈ ప్రివ్యూకి సంబంధించి గతంలో వార్తలు బయటకు రాగా ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఒక చిన్న వీడియో విడుదల చేశారు.
ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అమీర్ ఖాన్, నాగార్జున, నాగచైతన్య, సుకుమార్, రాజమౌళి రావడం వాళ్ళందరూ కలిసి చర్చించుకోవడం తర్వాత సినిమా చూడడం వంటి విశేషాలు చూపించారు. ఈ సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉందో వర్ణిస్తూ అమీర్ ఖాన్ తో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా వీడియోలో చూపించారు.
ఇక చివరిలో సినిమా చూసిన తర్వాత అమీర్ ఖాన్ ను మెగాస్టార్ చిరంజీవి సత్కరించడం కూడా చూపించారు. ఇక ఈ క్రమంలో సినిమా చూసిన తరువాత అమీర్ ఖాన్ ఏడ్చేయడం కనిపిస్తోంది. ఇక ఈ వీడియో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్ల క్రితం జపాన్లోని ఒక ఎయిర్పోర్టులో అమీర్ ఖాన్ తో కలిసి కొన్ని క్షణాలు మాట్లాడడంతో తాను కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యానని పేర్కొన్నారు.

మా ఇంట్లో ప్రత్యేక ప్రివ్యూ వేసినందుకు అమీర్ ఖాన్కు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు చిరు. అన్నింటికంటే ముఖ్యంగా మీరు తీసిన సినిమా ఒక జెం. ఎంతో అద్భుతమైన ఎమోషనల్ జర్నీ అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన 'లాల్ సింగ్ చద్దా'ను అద్వైత్ చందన్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయింది. ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ తన మొదటి రివ్యూ చేయడంతో ప్రేక్షకులలో కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి.


Click it and Unblock the Notifications











