twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి మరో సెన్సేషన్.. సైరా కోసం ఎవరూ చేయని విధంగా గురి పెట్టాడు

    |

    ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా నర్సింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నభూతో నభవిష్యత్ అనే తీరులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కావాల్సిన అన్ని హంగులను అద్దటంతోపాటు చిరంజీవి ప్రత్యేకంగా ఏ విషయాన్ని వదలడం లేదు. తాజాగా సినిమా కథకు అనుగుణంగా కావాల్సిన రైఫిల్ షూటింగ్ కోసం కూడా ప్రత్యేకమైన శ్రద్దను తీసుకొంటున్నారు. అందుకు సంబంధించిన విషయాలు మీ కోసం..

    నిరీక్షణకు తెర.. రాంచరణ్ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!నిరీక్షణకు తెర.. రాంచరణ్ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!

    రైఫిల్ షూటింగ్ కోసం

    రైఫిల్ షూటింగ్ కోసం

    రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ పొందడానికి ఒలంపిక్ మెడలిస్ట్ గగన్ నారంగ్‌తో చిరంజీవి భేటి అయ్యారు. షూటింగ్‌లో మెలుకవలు నేర్చుకొనేందుకు గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీకి స్వయంగా వెళ్లారు. రైఫిల్ షూటింగ్‌లో వాస్తవికత ఉట్టిపడే విధంగా కొన్ని కిటుకులు నేర్చుకొన్నట్టు గగన్ నారంగ్ వెల్లడించారు.

    షూటర్ గగన్ నారంగ్ వద్ద

    షూటర్ గగన్ నారంగ్ వద్ద

    చిరంజీవి రిక్వెస్ మేరకు రైఫిల్ షూటింగ్‌లో నారంగ్ ద్వారా శిక్షణ పొందారు. 2012లో జరిగిన లండన్ ఒలంపిక్‌లో నారంగ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసింది. అలాంటి గగన్ నారంగ్ వద్ద చిరంజీవి సైరా కోసం శిక్షణ పొందడం చర్చనీయాంశమైంది.

    సోషల్ మీడియాలో గగన్ నారంగ్

    చిరంజీవి తన వద్ద శిక్షణ పొందిన విషయాన్ని గగన్ నారంగ్ సోషల్ మీడియాలో స్పందించారు. చిరంజీవి షూటింగ్‌ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన తీరు నన్ను ఎంతో ఆకట్టుకొన్నది. చిరంజీవి గారు చాలా మానవీయ కోణంలో ఆకట్టుకొన్నారు. సమాజం గురించి ఆయన ఆలోచించే విధానం నాకు స్ఫూర్తిగా, చైతన్య పరిచింది అని గగన్ నారంగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    హైదరాబాద్‌లో షూటింగ్

    హైదరాబాద్‌లో షూటింగ్

    ఇదిలా ఉండగా, సైరా చిత్రం తాజా షెడ్యూల్‌ షూటింగ్‌ బుధవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నది. ఈ షెడ్యూల్‌లో నయనతార, తమన్నా భాటియా పాల్గొంటారు. చిరంజీవి, నయనతార, తమన్నాపై కీలక సన్నివేశాలతోపాటు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 50 శాతం షూటింగ్‌ పూర్తి అయినట్టు సమాచారం.

    జాతీయ స్థాయి చిత్రంగా

    జాతీయ స్థాయి చిత్రంగా

    జాతీయ స్థాయి చిత్రంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ‘సైరా' చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసే విధంగా నిర్మాత రాంచరణ్ ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Megastar Chiranjeevi reached the Gagan Narang Shooting Academy to learn how to shoot from the best. Gagan Narang, a bronze medal winner at the 2012 London Olympics, spent over an hour helping the actor understand the basic and he nuances of shooting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X