»   » రానా చిత్రానికి మెగాస్టార్ వాయిస్ ఓవర్

రానా చిత్రానికి మెగాస్టార్ వాయిస్ ఓవర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువ హీరోలను తట్టి ప్రోత్సాహించడంలో మెగాస్టార్ చిరంజీవిది ప్రత్యేకమైన స్టైల్. ఎవరైనా మంచి చిత్రంలో నటించినా.. గొప్పగా నటనను ప్రదర్శించినా స్వయంగా వెళ్లి యువ హీరోలను గతంలో అభినందించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా శతమానం భవతి చిత్రంలో మంచి నటనను కనబరిచిన శర్వానంద్ ను ప్రత్యేకంగా చిరంజీవి అభినందించారు కూడా.

తాజాగా దగ్గుబాటి రానా చిత్రానికి తన వంతు సహాయం చేయడానికి చిరంజీవి ముందుకు వచ్చారు. రానా కెరీర్ లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొన్న ఘాజీ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెగాస్టార్ సిద్దమయ్యారు. కీలక సన్నివేశాల్లో తన గళాన్ని వినిపించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెడీ అయినట్టు సమాచారం.


Megastar Chiranjeevi Will Lend his Voice Ghazi

హిందీలో ఘాజీ చిత్రానికి బిగ్ బీ అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఘాజీ చిత్ర టీజర్ ను చూసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపడమే కాకుండా అమితాబ్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.

English summary
Megastar Chiranjeevi Will Lend his Voice for Rana Daggubati and Taapsee Pannu's Ghazi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu